హైదరాబాద్

‘నిమజ్జన’ భక్తులకు రౌండ్ ది క్లాక్ వాటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : నగరం వ్యాప్తంగా గురువారం జరిగే వినాయక నిమజ్జనంలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం రౌండ్ ది క్లాక్ మంచినీటి ప్యాకెట్లను సరఫరా చేయనున్నట్లు జలమండలి ఎండీ దాన కిషోర్ వెల్లడించారు. అవసరమైన సిబ్బందిని మూడు షిఫుల్లో పనిచేసేలా నియమించినట్లు తెలిపారు. 115 ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుకూలంగా శిబిరాలను ఏర్పాటు చేసి సుమారు 30లక్షల 52వేల వ్యాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. వీటితో పాటు వినాయక నిమజ్జన శోభయాత్ర జరిగే ప్రాంతాల్లో మంచినీటి పైప్‌లైన్లకు ఏమైనా లీకులుంటే వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఎయిర్‌టెక్ యంత్రాలతో ప్రధాన రహదారితో పాటు చిన్న చిన్న గల్లీల్లో సైతం సీవరేజీ పైప్‌లైన్లను శుభ్రం చేయాలని, మ్యాన్‌హోళ్లు పొంగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. మంచినీటి ప్యాకెట్ల పంపిణీ గురువారం ఉదయం మూడు గంటలకే ప్రారంభమవుతుందని, రద్దీని బట్టి కొన్ని ప్రాంతాల్లో 24 గంటలు, మరికొన్ని ప్రాంతాల్లో 48 గంటల పాటు శిబిరాలను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై రోటరీ పార్కు, సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాం, నన్నయ్య విగ్రహాం, జాషువా విగ్రహం, పోలీసు ఔట్‌పోస్టు, ఎన్టీఆర్ గార్డెన్‌కు ఇరువైపులా రెండు, ప్రసాద్ ఇమాక్స్ సమీపంలోని ఇందిరా విగ్రహం దగ్గర మంచినీటి శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎండీ వెల్లడించారు.