హైదరాబాద్

సమన్వయ కమిటీతో టీడీపీ సభ్యత్వ నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 13వ తేదీలోపు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరిశీలనానంతరం కమిటీల నియామకం, స్వరూపం, స్వభావం అంశాలపై మరింత స్పష్టత వస్తోందని ఆయన వెల్లడించారు.
బుధవారం సిటీ పార్టీ ఆఫీసులో సికిందరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్యనేతల సమావేశం జరిగింది. సమావేశానికి పరిశీలకులుగా చంద్రశేఖర్ రెడ్డి, సమన్వయకర్తగా రామకృష్ణ హాజరయ్యారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కమిటీల నియామకం, ముఖ్యనేతలతో సమావేశం వంటివి పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియకు ముందస్తు కసరత్తుగా ఆయన పేర్కొన్నారు. పార్టీని పటిష్టత పర్చుకోవటంతో పాటు సర్కారు వైఫల్యాలను ఎండగట్టడం కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు, వారికి మరింత శిక్షణనివ్వనున్నట్లు తెలిపారు. శిబిరాల నిర్వహణ కోసం ఎన్టీఆర్ భవన్‌లో వౌలిక సదుపాయాలు సమకొరుస్తున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ కేవలం మొక్కుబడి కోసమే రూపకల్పన చేశారని, రాష్ట్రానికి, ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. భూమి లేని దళిత రైతులకు మూడు ఎకరాల భూమి విషయాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించలేదని ఆరోపించారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం సుమారు మూడు లక్షల కుటుంబాలకు భూమి లేదని, ఈ కుటుంబాలకు సుమారు పది లక్షల ఎకరాల భూమి పంపిణీ చేయాల్సి ఉండగా, గడిచిన ఆరేళ్లలో కేవలం పదివేల ఎకరాలు మాత్రమేనని, ఈ విషయాన్ని బడ్జెట్‌లో ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. సమావేశంలో టీడీపీ నేతలు పీ.సాయిబాబా, నల్లెల్ల కిషోర్, శ్రీపతి సతీష్, లక్ష్మణ్ నాయక్, బాలరాజ్ గౌడ్, బిల్డర్ ప్రవీణ్ నాగూ నాగేశ్, కొమురన్న మహిళా నేతలు లత, జయశ్రీ పాల్గొన్నారు.