హైదరాబాద్

అర్థరాత్రి తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లకు జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరమ్మతుల పనులు జరుగుతున్నాయి. పనులను మంగళవారం అర్థరాత్రి మేయర్ బొంతు రామ్మోహన్ తనిఖీ చేశారు. బేగంపేట ఫ్లైఓవర్‌పై చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, జీహెచ్‌ఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో అన్ని గుంతలను పూడ్చివేయాలని ఆదేశించినట్లు, ఇప్పటి వరకు దాదాపు పూర్తి స్థాయిలో గుంతల పూడ్చివేత పనులు జరిగాయని వెల్లడించారు. నగరంలోని ఐదు ప్రధాన ఫ్లైఓవర్లపై రోడ్ల పనురుద్ధరణ పనులను రూ.కోటిన్నర వ్యయంతో చేపట్టినట్లు తెలిపిరు. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో పనులను చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున, పనులను చేపట్టలేకపోయామని, వర్షాలు తగ్గగానే పనులను చేపట్టనున్నట్లు మేయర్ తెలిపారు.
ఇంట్లో నీటి నిల్వలను తొలగించిన మేయర్
సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు దోమల నివారణ చర్యల్లో భాగంగా ఇంట్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలనే మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకు మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం సతీమణితో కలిసి ఇంట్లోని నీటి నిల్వలు తొలగించారు. ఇంట్లోని పూల మొక్కల కుండీలు, ఖాళీ డబ్బాల్లో నీటిని పూర్తిగా తొలగించటంతో పాటు పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ ఇళ్లలోని నీటి నిల్వలను తొలగించుకోవాలని మేయర్ కోరారు.
పారిశుద్ధ్యంపై ‘డిప్యూటీ’ తనిఖీలు
నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున, వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ క్షేత్ర స్థాయి విధులకు తరలాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ పలు ప్రాంతాల్లో పర్యటించి, శానిటేషన్ పనులను తనిఖీ చేశారు. జియాగూడ డివిజన్ పరిధిలో పలు బస్తీలల్లో ఆయన కార్పొరేటర్ మిత్ర కృష్ణ, స్థానిక డిప్యూటీ కమిషనర్, ఎంటమాలజీ విభాగం అధికారులతో కలిసి పర్యటించారు. పలు చోట్ల పేరుకుపోయిన చెత్తను తొలగించారు. పలు ఇళ్లను సందర్శించి, ఇళ్లలో నీటి నిల్వలను తొలగించారు. ఇళ్ల పరిసరాలు, ఖాళీ స్థలాలు, పాత్రల్లో దోమలు గుడ్లు పెట్టడంతో అవి ఉత్పత్తి పెరిగి, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని వివరించారు. జ్వరం వచ్చి, డెంగ్యూ, మలేరియా లక్షణాలేమైనా ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిదని సూచించారు. కేశవస్వామి నగరంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను, జియాగూడ స్లాటర్ హౌజ్‌ను కూడా డిప్యూటీ సందర్శించారు.