హైదరాబాద్

నిమజ్జనానికి సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరంలో పదకొండు రోజుల పాటు భక్తుల నుంచి ఘనంగా పూజలందుకున్న గణనాథులను గంగమ్మ తల్లి ఒడికి చేర్చేందుకు సర్వం సిద్ధమైంది. నిమజ్జనానికి కేంద్ర బింధువైన హుస్సేన్‌సాగర్‌తో పాటు సరూర్‌నగర్ చెరువుల వద్ద భారీగా ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సార్ వరకు 21 కిలోమీటర్ల శోభయాత్ర రూట్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగర్‌కు చేరుకునే సుమారు 261 కిలోమీటర్ల పొడువున నిమజ్జనానికి రూ. 22.89 కోట్లతో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు వీలుగా నగరంలోని మూడు లక్షల సీసీ కెమెరాల ద్వారా బల్దియా, నగర పోలీసు శాఖలు వేర్వేరుగా ఏర్పాటు చేసిన రెండు కంట్రోల్ రూంల నుంచి ఎప్పటికపుడు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సారి హుస్సేన్‌సాగర్‌లో మొదటిసారిగా ప్రభుత్వం తరపున గంగహారతి కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఖైరతాబాద్, బాలాపూర్‌లోని భారీ గణపయ్యలను ఈసారి కాస్త ముందుగానే నిమజ్జనానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విగ్రహాల నిమజ్జనానికి ఈసారి ప్రత్యేకంగా 26 కొలనులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు శివారుల్లో నిమజ్జనం జరిగే అన్ని ప్రాంతాల్లో దాదాపు 255 క్రేన్లను, 94 స్టాటిక్ క్రేన్లను ఏర్పాటు చేయటంతో పాటు హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ చెరువుల వద్ద డిజాస్టర్ రెస్క్యూ ఫోర్సు(విపత్తుల నివారణ బృందాలు)ను అందుబాటులో ఉంచనున్నారు. హుస్సేన్‌సాగర్ వద్ద 20 బోట్లను అందుబాటులో ఉంచనున్నారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం ఒత్తిడిని తగ్గించేందుకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వేర్వేరు ప్రాంతాల్లో 22.89 కోట్ల రూపాయల ఖర్చుతో 26 నిమజ్జన కొలనులను సిద్ధం చేశారు. ఒక్కొక్క కొలనులో ఐదువేల విగ్రహాల వరకు నిమజ్జనం చేసేలా, వాటి వ్యర్థాలను వెంటనే బయటకు తీసేలా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం జరిగే రూట్‌లో, వివిధ ప్రాంతాల్లో ఎప్పటికపుడు వ్యర్థాలను తొలగించేందుకు వీలుగా సుమారు 9710 మంది పారిశుద్ధ్య కార్మికులను, 680 మంది జవాన్లను ఏర్పాటు చేశారు. వీరంతా ఎప్పటికపుడు చెత్తను సేకరించి, తొలగించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం లాఅండ్‌ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులతో పాటు రిజర్వ్‌డ్ పోలీసులను కూడా రంగంలో దింపారు. భక్తుల కోసం 30 లక్షల పైచిలుకు వాటర్ ప్యాకెట్లను 115 కౌంటర్లతో ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. నిమజ్జనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం ఆర్టీసి, మెట్రోరైలు ప్రత్యేక సర్వీసులను నడపనున్నాయి. ఖైరతాబాద్ వినాయకుడిని గురువారం వీలైనంత త్వరగా నిమజ్జనానికి తరలించేందుకు బుధవారం ఏర్పాట్లు మొదలయ్యాయి.
రెండు కంట్రోల్ రూమ్‌లు
గురువారం జరగనున్న వినాయక నిమజ్జన శోభయాత్రను ఎప్పటికపుడు పర్యవేక్షించేలా, అందులో పాల్గొనే ప్రతి ఒక్కరి కదలికలను గమనించేందుకు ఈసారి రెండు కంట్రోల్ రూమ్‌లు పని చేయనున్నాయి. హుస్సేన్‌సాగర్ వద్ద అప్పర్ ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో కూడా పోలీసు, జీహెచ్‌ఎంసీతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మేయర్ బొంతు రామ్మోహన్, పోలీసు కంట్రోల్ రూం నుంచి నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మధ్యాహ్నం వరకు పర్యవేక్షించి, ఆ తర్వాత పాతబస్తీలో తిష్టవేసి నిమజ్జన బందోబస్తును నేరుగా పర్యవేక్షించనున్నారు.