హైదరాబాద్

పెండింగ్ యూనిట్లను గ్రౌండింగ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ప్రభుత్వ సంక్షేమ శాఖల ద్వారా పేద ప్రజల ఆర్థికాభివృద్ధికి మంజూరై, నేటికీ పెండింగ్‌లో ఉన్న యూనిట్లను ఈనెల 30లోపు గ్రౌండింగ్ చేయాలని బ్యాంకర్లను జాయింట్ కలెక్టర్ జీ.రవి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి బ్యాంకర్స్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ వివిధ సంక్షేమ శాఖలకు చెందిన సబ్సిడీ రిలీజు అయిన యూనిట్లకు వెంటనే గ్రౌండింగ్ చేయాలని, గ్రౌండింగ్ పూర్తయిన యూనిట్లకు యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు సంబంధించి అధికారులు పంపాలని ఆదేశించారు. పెండింగ్‌లో గల కారణాలను పరిశీలిస్తూ లబ్దిదారులు ఆసక్తి కనబర్చేలా, ఒక వేళ లబ్దిదారులను గుర్తించలేని పక్షంలో సబ్సిడీనీ వెంటనే ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశించారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌తో జరిగే మోసాలను ప్రజలు తెలుసుకునేలా వారిని జాగృత పర్చాలని సూచించారు. బ్యాంకర్లు లబ్ధిదారుల యూనిట్లను గ్రౌండింగ్ చేసే సమయంలో అవసరమైన మేరకు ధ్రువపత్రాలను తీసుకుని, నిర్దేశించిన సమయంలో గ్రౌండింగ్ చేయాలని అన్నారు. సమావేశంలో నాబార్డ్ అధికారి తపన్, ఏజీఎం రెడ్డి, ఎల్జీఎం శ్రీనివాస రావు, బీసీ వేల్ఫేర్ అధికారి విమలాదేవీ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాన్యా నాయక్ పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో
విద్యార్థుల నమోదు పెంచాలి
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల నమోదును పెంచి, మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను జేసీ రవి ఆదేశించారు.
కాలేజియేట్ ఎడ్యుకేషన్‌పై జేసీ శుక్రవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 17 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయని, వాటిల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా అధ్యాపకులు భోధన సాగించాలని సూచించారు. సమావేశంలో జిల్లా మైనారిటీ వేల్ఫేర్ అధికారి ఖాసిమ్, జిల్లా సంక్షేమాధికారి విమలాదేవి, గిరిజన సంక్షేమాధికారి రమాదేవి, జిల్లా ఉపాధి కల్పనాధికారి మైత్రిప్రియ పాల్గొన్నారు.

పొత్తులతోనే పార్టీ నష్టపోయింది
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 13: ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవటంతోనే నష్టపోయిందని పాతబస్తీ టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గలోని టీడీపీ ముఖ్యనేతల సమావేశం శుక్రవారం నగర పార్టీ కార్యాలయంలో జరిగింది. పార్టీ నేతలు జయరామ్ పరిశీలకులుగా, సమన్వయకర్తగా రామకృష్ణ హాజరైన సమావేశంలో నగర టీడీపీ నేత పీ.సాయిబాబా మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు, సభ్యత్వ నమోదుకు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి సూచించిన సలహాలను పార్టీ నేతలకు వివరించారు. పార్టీ పటిష్టతతో పాటు ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్యకర్తలు, నేతలు ముందుకెళ్లాల్సిన అవసరముందని సూచించారు. నేటికీ టీడీపీ కోసం అహర్నిశలు కష్టపడే కార్యకర్తలు చాలా మంది ఉన్నారని, వారిని గుర్తించి, వారికి సరైన బాధ్యతలు అప్పగించే పార్టీకి పూర్వవైభవం వస్తోందని అభిప్రాయపడ్డారు. గతంలో కార్పొరేటర్ అభ్యర్థిని ప్రకటించాలంటే పార్టీ స్థానికంగా వచ్చి, అక్కడే అభ్యర్థులను ప్రకించేవారని, దాంతోకార్యకర్తల్లో ఐక్యత ఉండేదని వివరించారు. శనివారం మూడు గంటలకు రాష్టప్రార్టీ ఆఫీసులో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉంటారని, నగర నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశమున్నట్లు తెలిపారు. నేడు మహానగర ప్రజలు విష జ్వరాల బారిన పడి వందల సంఖ్యల్లో ఆసుపత్రుల్లో చేరుతున్నా, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవటం శోఛనీయమని అన్నారు. ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా లేకపోవటం ప్రభుత్వానికి ప్రజాసంక్షేమంపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. సమావేశంలో టీడీపీ నేతలు నల్లెల్ల కిషోర్ బాలరాజ్ గౌడ్, ప్యాట నందకిషోర్, అంజద్, మహిళా నేతలు అన్నపూర్ణ, శాంతి పాల్గొన్నారు.

భవనం పైనుంచి పడి యువకుడి మృతి
ఖైరతాబాద్, సెప్టెంబర్ 13: ఫోన్‌లో చాటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి క్రిందపడి మృతిచెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా మండపేటకు చెందిన హర్షవర్దన్ చౌదరి (24) ఎంటెక్ పూర్తి చేశారు. తన నానమ్మకు క్యాన్సర్ వ్యాధి ఉండటంతో చికిత్స కోసం నగరానికి వచ్చాడు. శ్రీనగర్‌కాలనీలోని శాలివాహన నగర్‌లోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. గురువారం రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో భవనం టెర్రాస్‌పైకి వెళ్లి ఫోన్‌లో చాటింగ్ చేస్తున్నాడు. ఇయర్‌ఫోన్స్ కింది జారిపోవడంతో వాటిని అందుకునే క్రమంలో భవనం పైనుంచి కిందపడిపోయాడు. వర్షవర్దన్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అన్నిట్లో మేడ్చల్ ముందంజ
మేడ్చల్, సెప్టెంబర్ 13: పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాల్లోనూ అన్నింట్లోనూ మేడ్చల్ ముందంజలో ఉంటుందని పార్టీ కమిటీల నియామకంలోనూ మనమే ముందుండాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఓం శివసాయి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన మేడ్చల్, శామీర్‌పేట్, మూడుచింతలపల్లి మండలాల టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పనులతో పాటు టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వం లక్ష దాటి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని కమిటీలు పూర్తి చేసి ప్రథమంగా నిలువాలని చెప్పారు. మండలాల కమిటీల పరిశీలకులగా వచ్చిన రాష్ట్ర పార్టీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మూడు మండలాల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో వేర్వేరుగా కూర్చోని చర్చించుకుని పేర్లు ఇవ్వాలని సూచించారు. మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జడ్పీ చైర్ పర్సన్ శరత్‌చంద్రా రెడ్డి, సుధీర్ రెడ్డి చర్చించుకుని నియోజకవర్గంలోని అన్ని మండలాల జాబితాలను సేకరించిన తర్వాత సామాజిక న్యాయం పాటిస్తూ పార్టీ మండల కమిటీలను శనివారం ప్రకటిస్తామని ప్రకటించి సమావేశాన్ని ముగించారు. కార్యక్రమంలో భాగంగా టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు.

పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

షాద్‌నగర్, సెప్టెంబర్ 13: పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ఈ ఆవకాశాన్ని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమ, సినిమాటోగ్రాఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఫరూఖ్‌నగర్ మండలం కంసాన్‌పల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ప్రొజెన్ సెమెన్ బుల్ స్టేషన్ (పశు వీర్యోత్పత్తి కేంద్రం)ను సందర్శించి పరిశీలించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వచ్చే డిసెంబర్ నాటికి పశు వీర్యోత్పత్తి కేంద్రం నిర్మాణం పనులను పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పాడి పరిశ్రమను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల కులవృత్తులను అదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. 36 ఎకరాల విస్తీర్ణంలో పశు వీర్యోత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు, పశు వీర్యం కోసం కరీంనగర్ వెళ్లాల్సి వచ్చేందని, ప్రస్తుతం స్థానికంగానే లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ మాట్లాడుతూ డిసెంబర్ నాటికి ఈ కేంద్రాన్ని పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. రంగారెడ్డి జిల్లా జడ్పీచైర్మన్ తీగల అనితా రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, ఫరూఖ్‌నగర్ ఎంపీపీ ఖాజా ఇద్రీస్, జడ్పీటీసీ పీ.వెంకట్ రాంరెడ్డి, సర్పంచ్ బసిరెడ్డి పద్మ నరేందర్ రె