హైదరాబాద్

దళితులను విభజించే కుట్రలను సాగనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : దళితులను విభజించే కుట్రలను సాగనివ్వబోమని మాలమహానాడు హెచ్చరించింది. ఆదివారం పంజాగుట్ట ప్రేమ్‌నగర్ అంబేద్కర్ భవన్‌లో మాలమహానాడు అధ్యక్షుడు చెన్నయ్య అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ.. వర్గీకరణతో దళితులను విభజించి మరింత అణిచివేయాలని ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏళ్లు గడిచినా బడుగు, బలహీన వర్గాల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందని అన్నారు. రాజ్యాంగ ఫలాలను ఇప్పుడిప్పుడే అందుకుంటున్న వారిని బలహీన పరచాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సైతం వర్గీకరణ చెల్లదని చెప్పినా, జాతీయ ఎస్సీ కమిషన్ వర్గీకరణ సరికాదని తేల్చినా వర్గీకరణ బీజేపీ చేయాలని చూస్తుందని మండిపడ్డారు.
సున్నితమైన వర్గీకరణ విషయంలో జోక్యం చేసుకుంటే బీజేపీకి పట్టుగతులు లేకుండా పోతాయని హెచ్చరించారు. బీజేపీ కుట్రలను యావత్ ప్రపంచానికి తెలియజేసేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి దేశ రాజధాని ఢిల్లీలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది చివరల్లో హలో మాల.. ఛలో ఢిల్లీ పేరుతో ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో భాస్కర్, మద్దెల వెంకటేష్, నర్సింహా, భగవాన్‌దాస్, అశోక్, రావుల విజయ్ కుమార్, రమేష్, నర్సింగ్ రావు, రమేష్ పాల్గొన్నారు.