హైదరాబాద్

కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, కార్మికులు, సఫాయి కార్మికుల సంక్షేమం పట్ల జీహెచ్‌ఎంసీ అనుసరిస్తున్న తీరుపై మరో జాతీయ కమీషన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
రెండు నెలల క్రితం జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యుడు రాములు కూడా అధికారుల వద్ద సమాచారం అందుబాటులో లేకపోవటం, కనీసం ఎంత మంది, ఏ విభాగాల్లో పనిచేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ లేకపోవటంతో తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే! తాజాగా జాతీయ సఫాయి కర్మచారి కమీషన్ సభ్యులు జగదీష్ హీరేమణి కూడా జీహెచ్‌ఎంసీ అధికారులు తీరుపై మండిపడినట్లు సమాచారం. మంగళవారం ఆయన సఫాయి కార్మికుల ప్రత్యామ్నాయ పునరావాసం చట్టం 2013 అమలు తీరు, కార్మికుల సంక్షేమం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీని సందర్శించారు.
సమావేశంలో ఆయన సఫాయి కార్మికులకు సంబంధించి ఆరోగ్య పరీక్షలు, బీమా, వారి పిల్లల చదువు కోసం చేపట్టాల్సిన చర్యల గురించి వివరిస్తూ, వారికోసం ఎంపిక చేసిన కార్యక్రమాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశిస్తుండగా, సెంట్రల్ జోన్ జోనల్ కమిషనర్ ముషారఫ్ జోక్యం చేసుకుని చూస్తామని సమాధానమివ్వటంలో ఏం చూస్తారు? ఎన్ని ఏళ్ల నుంచి ఏం చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? క మిషన్ సభ్యులు వచ్చినపుడు మాత్రమే మీరు కార్మికుల గురించి మాట్లాడుతున్నారని అందులో కనీసం కార్మికుల సంఖ్య కూడా మీ వద్ద స్పష్టంగా అందుబాటులో లేకపోవటం మీరు ఎంత కృషి చేస్తున్నారనేందుకు నిదర్శనమని ఘాటుగా స్పందించారు. పరిపాలన విభాగం, హెల్త్ శానిటేషన్ తదితర విభాగాలకు చెందిన అధికారులు కమీషన్ సభ్యుడు జగదీష్ అడిగిన ప్రశ్నకు సమాచారం అందుబాటులో లేదని సమాచారమివ్వటంతో ఆయన తీవ్ర స్థాయిలో మండిపడినట్లు సమాచారం. అంతలో కమిషనర్ లోకేశ్‌కుమార్ జోక్యం చేసుకుని సఫాయి కార్మికులకు ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించాలన్న చట్టం 2013లో వచ్చినప్పటికీ, తాము అప్పటికే నగరంలో యంత్రాల ద్వారా స్కావేంజింగ్ పనులను నిర్వహిస్తున్నామని వివరిస్తూ, 2004లో తాము 353 మంది సఫాయి కార్మికులను గుర్తించినట్లు తెలిపారు. సఫాయి కార్మికులకు బెంగుళూరులో అమలవుతున్న స్కీంలు అమలు కావాలని ఆదేశించారు. 60 ఏళ్లు దాటిన సఫాయి కార్మికుడి వారసులకు ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించాలని, పదవి నుంచి విరమణ పొందిన, లేక స్వచ్ఛందంగా తప్పుకునే కార్మికులకు రూ. 10లక్షలు చెల్లించాలని సూచించారు. వారిపిల్లల విద్యాభ్యాసానికి ప్రత్యేక సౌకర్యాలను కల్పించి, కార్మికులు, వారి కుటుంబానికి తరుచూ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
ఏం అమలు చేశారో నివేదిక పంపాలి
జాతీయ స్థాయి కమీషన్లు వచ్చినపుడు తూతూమంత్రంగా సమావేశాలు హాజరుకావటం అధికారులకు మామూలైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసిన కమీషన్ సభ్యుడు తాను సూచించిన కార్యక్రమాలు, పథకాలు ఎంత వరకు మీరు అమల్లోకి తెచ్చారన్న విషయాన్ని తనకు నివేదికను పంపాలని ఆయన జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.