హైదరాబాద్

పల్లె ప్రగతి అమలుతో పనులు వేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక 30 రోజుల్లో అమలులో భాగంగా పనులలో వేగం పెంచాలని రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హరీష్ ఆదేశించారు.
బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో 30 రోజుల పంచాయతీ ప్రణాళిక కార్యాచరణ పనుల పురోగతి పై జిల్లా నోడల్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రణాళిక గడువు కాలం సగం ముగిసిందని, పనులను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేయాలని అన్నారు. గ్రామంలో ఊరి (ఎంట్రీ) మొదట, చివర (ఎక్జిట్) పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. పల్లెలు పచ్చగా కళకళలాడేలా గ్రామాల్లో మొక్కలను నాటాలని చెప్పారు.
అధికారులకు షోకాజ్ నోటీసులు
గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక 30 రోజుల్లో భాగంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులకు రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హరీష్ షోకాజ్ నోటీసులను జారీ చేశారు.
యాచారం మండలం ఏఈఓలు పురుషోత్తం, ఏ.గురుప్రసాద్, శంకర్‌పల్లి మండలం మహలింగాపురం ఎంఏఓ కృష్ణవేణి, ఆలంకమ్‌గూడ ఏఈఓ వౌణిక, గాజులగూడ ఏఈఓ సౌమ్య, కొత్తపల్లి ఏఈఓ చంద్రప్రకాష్ రెడ్డికు నోటీసులను జారీ చేశారు.
ఆర్‌బీఐ నిబంధనలు పాటించాలి
రైతులకు పరిమితిలోపు పంట రుణాలను అందించడంలో రైతులకు ఇబ్బందులకు గురి చేయొద్దని రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హరీష్ ఆదేశించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో డీసీసీ-డీఎల్‌ఆర్‌సీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. రూ.1.50 లక్షల రుణాల వరకు ఎలాంటి ఆంక్షలు విధించకూడదని చెప్పారు.
కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రిజ్వాన్, ఆర్బీఐ ఏజీఎం సవితాశ్రీ, నాబార్డు అధికారి కోల్హి, పరిశ్రమల శాఖాధికారి రాజేశ్వర్ రెడ్డి, పీడీ డీఆర్‌డీఏ ప్రశాంత్ కుమార్, ఎస్‌బీఐ ఆర్‌ఎం రవికిరన్, డీజీఎం రవింద్రబాబు పాల్గొన్నారు.