హైదరాబాద్

రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పలువురు వక్తలు ఆకాక్షించారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మేదరి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ దిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, బీసీ కమిషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. నేటి అధునిక యుగంలో కూడా వెదురుకు సాటిలేదని అన్నారు. వెదురు లేకపోతే సమాజం వైపరీత్యానికి గురవుతుందని పేర్కొన్నారు. ప్రగతి గ్రూప్స్ చైర్మన్ డా.జీబీకే రావు, అటవిశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, సంఘం ప్రతినిధులు జోర్రిగల శ్రీనివాసులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కే.మురళీకృష్ణ, వాసం నర్సింగ రావు, మదిరె సత్యనారాయణ, కోంటు ముకుందం, జోర్రిగల శంకరయ్య, సూరినేని కిషన్ పాల్గొన్నారు.
తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవాలి
కాచిగూడ, సెప్టెంబర్ 18: తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషన్ బుద్ధా మురళి అన్నారు. శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘బుర్రకథ సప్తాహం’ కార్యక్రమం బుధవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బుద్ధా మురళి పాల్గొని బుర్రకథ కళాకారులను అభినందించి సత్కరించారు. గానసభ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు బుర్రకథ సప్తాహం నిర్వహించి కళాకారులను ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ బుర్రకథ కళాకారుడు గంధం వేంకటేశం శిష్య బృందం ప్రదర్శించిన ‘బొబ్బిలి యుద్ధం’ బుర్రకథ ఆకట్టుకుంది. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు, ప్రముఖ సామాజిక వేత్త డా.కొత్త కృష్ణవేణి, యేభూషి యాదగిరి, రచయిత్రి లక్కరాజు నిర్మల పాల్గొన్నారు.

గురువులకు సత్కారం
కాచిగూడ, సెప్టెంబర్ 18: డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ‘గురువందనం’ మహోత్సవ కార్యక్రమం కమలాకర లలిత కళాభారతి, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి పాల్గొని గురువులను సత్కరించారు. తెలుగు సంస్కృతిలో గురువులను సత్కరించుకోవాడం సంప్రదాయమని అన్నారు. ప్రముఖ గాయకులు లలిత హరిప్రియ నిర్వహణలో నిర్వహించిన ‘అన్నమయ్య శ్రీపదార్చన’ అలరించింది. ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సంగీత విద్వాంసులు వేదవతి ప్రభాకర్, కర్ణాటక శాస్ర్తియ సంగీత విద్వాంసులు డా.కొమండూరి శేషాద్రి, లలిత సంగీత దర్శకుడు విన్నకోట మురళీకృష్ణ, సంస్థ అధ్యక్షురాలు లయినెస్ భారతీ కమలాకర్ పాల్గొన్నారు.