హైదరాబాద్

‘స్వచ్ఛ’సాధనకు మరో ‘మహా’యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరంలో నూటికి నూరు శాతం స్వచ్ఛతను సాధించేందుకు, దేశంలోనే స్వచ్ఛతలో నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు జీహెచ్‌ఎంసీ మరో వినూత్న ప్రయోగాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా అమలు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ, విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థి దశ నుంచి స్వచ్ఛతపై అవగాహన పెంచి, యువతను చైతన్యవంతులను చేయగలిగితే నూటికి నూరు శాతం స్వచ్ఛత సాధన సాధ్యమని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ‘స్వచ్ఛ పాఠశాల’, క్లీన్ కమ్యూనిటీ చాంపియన్‌షిప్ అనే ప్రత్యేక కార్యక్రమాల్ని బుధవారం మేయర్ బొంతు రామ్మోహన్, విద్యాశాఖ కార్యదర్శి డా.బీ.జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే స్వచ్ఛ కార్యక్రమాలపై పూర్తి స్థాయి అవగాహన, స్ఫూర్తిని కలిగించడంతో ఆరోగ్యవంతనమైన సమాజం ఏర్పడుతోందని అన్నారు. ఈ దశలో జీహెచ్‌ఎంసీతో కలిసి పనిచేసేందుకు విద్యాశాఖ ముందుకు రావటం శుభపరిణామంగా మేయర్ పేర్కొన్నారు. స్వచ్ఛతకు ప్రతి విద్యార్థి స్వయంగా అంబాసిడర్‌గా మారి తమ పాఠశాలతో పాటు ఇంట్లోనూ, పరిసరాల్లోనూ స్వచ్ఛ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. నగరంలో కోటి జనాభా ఉండగా, కేవలం ఎనిమిది వేల మంది మాత్రమే నగర పరిశుభ్రతను చేపడుతున్నారని, వీరికి తోడు నగరవాసులు స్వచ్ఛందంగా తమ నివాసాలు, పరిసరాలలో పరిశుభ్రతను పాటించాలని కోరారు. ప్రతి ఇంట్లో దోమల ఉత్పత్తికి కారణమయ్యే నీటి నిల్వలను తొలగించాలని సూచించారు. విద్యాశాఖ కార్యదర్శి డా.బీ. జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందిస్తే, తద్వారా వారి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగుకి తెలియజేసి అవగాహన కల్పించాలని వివరించారు.
బహుమతుల ప్రదానం
పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛ స్ఫూర్తిని కలిగించేందుకు క్లీన్ కమ్యూనిటీ చాంపియన్‌షిప్, ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ చాంపియన్‌షిప్ అవార్డులను ప్రదానం చేశారు. 2145 కిలోల డ్రై రీసైక్లింగ్ చేసేందుకు వీలుగా ఉన్న వ్యర్థాలను సేకరించటంతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన గచ్చిబౌలీ ఓక్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన రెండో తరగతి విద్యార్థి కందునూరి ఆదిత్‌కు 2019 అంతర్ పాఠశాల రీసైక్లింగ్ చాంపియన్‌షిప్ అవార్డును నగర మేయర్ బొంతు రామ్మోహన్, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి అందజేశారు.