హైదరాబాద్

రూ.కోటి దాటిన స్వచ్ఛ జరిమానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్‌ఎంసీని గట్టెక్కించేందుకు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సంక్షోభం మరీ తీవ్రమైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోదా? అంటూ కొద్దిరోజుల క్రితం వరకు ధీమాతో ఉన్న జీహెచ్‌ఎంసీ ఇపుడు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అనే్వషిస్తోంది. ఉన్నతాధికారులు అందుబాటులో ఉన్న ఆదాయమార్గాల్లో రెవెన్యూను సమకూర్చుకోవటంతో పాటు ఆదాయ మార్గాల కోసం అనే్వషిస్తున్నారు. రెండు నెలల క్రితం బాండ్ల జారీతో రూ. 300 కోట్లను సమకూర్చుకున్న బల్దియా త్వరలోనే మరో రూ. 300 కోట్లను సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వం నగరంలో వేలాది కోట్లను వెచ్చించి ఎస్‌ఆర్‌డీపీ, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులు చేపట్టడంతో జీహెచ్‌ఎంసీ ఖజానాకు ఎన్ని నిధులొచ్చినా, పెండింగ్ బిల్లుల చెల్లింపులకే సరిపోతోంది. ఈ క్రమంలో కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదన మాట దేవుడెరుగు కానీ కనీసం రొటీన్ మెయింటనెన్స్ కూడా కష్టతరంగా మారుతోంది. దీంతో అధికారులు ఎలాగైనా రెవెన్యూను సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా బల్దియాకు ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లను ముమ్మరం చేయాలని ఇప్పటికే క్షేత్ర స్థాయి విధులు నిర్వర్తించే సిబ్బందికి లక్ష్యాలను విధించారు. ఈ సంవత్సరం రూ. 1800 కోట్లను వసూలు చేయాలన్న టార్గెట్ పెట్టుకున్న జీహెచ్‌ఎంసీ అదనపు పన్ను వసూళ్ల కోసం లక్ష రూపాయల్లోపు చెల్లించే ఆస్తులపై మరోసారి సర్వే నిర్వహిస్తున్నారు. గతంలో బల్దియా ఎన్నికల ముందు నగరంలో రూ. 1200లోపు ఆస్తిపన్ను చెల్లించే యజమానుల పన్నును రూ.101కు కుదించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన తర్వాత, ఇందుకు నిజమైన లబ్దిదారులను ఎంపిక చేసేందుకు రూ.లక్ష లోపు చెల్లించే ఆస్తులను రీ అసెస్‌మెంట్ చేసిన సంగతి తెలిసిందే! అప్పట్లో మధ్యలో ఆపేసిన ఆ సర్వేను ఇపుడు మళ్లీ చేపట్టారు. నెలరోజుల తరబడి ట్యాక్సు సిబ్బంది వసూలు చేస్తున్న ఆస్తిపన్ను నెలాఖరుతో సిబ్బంది జీతభత్యాలు, రొటీన్ మెయింటనెన్స్ కూడా సరిపోవటం లేదు. స్వచ్ఛ ఉల్లంఘనలను గుర్తించి, బాధ్యులైన వారి నుంచి వసూలు చేస్తున్న జరిమానాల వసూళ్లను ముమ్మరం చేసినా, ఆ కలెక్షన్ ఇటీవలే కోటి రూపాయలు దాటింది. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో ఔటాన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం కూడా మాంద్యం నెలకొందంటూ పలు శాఖలకు అసులు కేటాయింపులు సైతం జరపకుండా పరోక్షంగా నిధులిచ్చే పరిస్థితి లేదన్న సంకేతాలివ్వటంతో బల్దియాను అధికారులు ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కిస్తారో వేచి చూడాలి!