హైదరాబాద్

అలరించిన సినీ సంగీత విభావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : ప్రముఖ గాయకుడు డా.పీబీ శ్రీనివాస్ జయంతి సందర్భంగా గాయకుడు మురళీధర్ నిర్వహణలో సినీ సంగీత విభావరి ఆదివారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి వ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యూనల్ చైర్‌పర్సన్ డా.జీ.రాధారాణి పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు. గాయనీ, గాయకులు వీఏ లక్ష్మీ, ఉమ, సుజారమణ, వసంత లక్ష్మీ, నాగమణి, రజని, పద్మ, కుమారి లక్ష్మీ అలపించిన సినీ గీతాలు అలరించాయి. వైకే నాగేశ్వర రావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గంగాధర్, కలగ కృష్ణమోహన్, మల్కాజ్‌గిరి జడ్జి జనమంచి సాంబశివ, ఫణీందర్, జనమంచి చరణ్, రమణా రావు పాల్గొన్నారు.
విద్యార్థులు కష్టపడి చదవాలి
కాచిగూడ, సెప్టెంబర్ 22: విద్యార్థులు కష్టపడి చదివినప్పుడే ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని సౌత్ ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంటెంట్ అధ్యక్షుడు సీఎంఏ డా.పీవీఎస్ జగన్ మోహన్ రావు అన్నారు. రామంతాపూర్, ఉప్పల్ అరోరా పీజీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశ అర్హత సాధించిన ప్రథమ సంవత్సరం అడుగుపెడుతున్న నూతన విద్యార్థులకు ‘ఇండెక్షన్’ పేరిట అవగాహన సదస్సును ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జగన్ మోహన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. మారుతున్న టెక్నాలజీని అనుగుణంగా విద్యార్థులు రాణించాలని అన్నారు. విద్యార్థులకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ నిమ్మటూరి రాజాబాబు, సెక్రటరి డా.నిమ్మటూరి రమేష్ బాబు, వైస్ చైర్మన్ నిమ్మటూరి అనుదీప్, కళాశాల డైరెక్టర్లు ఎం.మాధవి, డా.పీ.రాజవర్దన్, డా.రఘునాగ ప్రభాకర్, సీహెచ్ సతీష్ కుమార్ పాల్గొన్నారు.
‘భక్తిగేయ కదంబం’ పుస్తకావిష్కరణ
కాచిగూడ, సెప్టెంబర్ 22: ప్రముఖ రచయిత్రి డా.బాల త్రిపూర సుందరి రచించిన ‘భక్తి గేయ కధంబం’ పుస్తకావిష్కరణ సభ శ్రీరాగ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఆదివారం ఆంధ్ర మహిళ సభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సృజన రంజని వ్యవస్థపక అధ్యక్షుడు సీతారామ శర్మ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. భక్తిగేయ కదంబంలో మంచి సాహిత్యంతో పాటు అరుదైన అన్నమయ్య సంకీర్తనలు, సాహిత్యానికి భావానికి సరిపోయే రాగాలను స్వరపరిచారని కీర్తించారు. బహుళ ప్రాచుర్యం పొందిన కళ్యాణి, శుద్ధసావేరి, రేవతి వంటి రాగాలు భక్త్భివాన్ని పెంపొందిస్తున్నాయని తెలిపారు. సులభమైన శైలిలో అందరూ పాడగలిగే విధంగా రూపొందించారని పేర్కొన్నారు. కార్యక్రమలో ప్రముఖ సంగీత విద్వాంసుడు బాలకృష్ణ శాస్ర్తీ పాల్గొన్నారు.