హైదరాబాద్

తొలిదశ ఉద్యమకారులకు పెన్షన్లు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1969లో పోరాడిన ఉద్యమకారులకు పెన్షన్, ఆరోగ్య బీమాను కల్పించాలని 1969 ప్రత్యేక తెలంగాణ ఉస్మానియా విద్యార్ధుల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యమకారుడు భూపతిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కొల్లూరి చిరంజీవి, రామదాస్, బాలకృష్ణ, బాంబు సూరి, కాంతారావు తదితరులు పాల్గొని మాట్లాడారు. 1969వ సంవత్సరంలో ఎన్నో ఉద్యమాలు చేసి తమ జీవితాలను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మొట్టమొదటి సారిగా జామే ఇస్లామియా స్టేషన్ కాల్చివేసి జైలు పాలయ్యామని అన్నారు. ఎనిమిది నెలల పాటు తరగతులను వదిలి ఉద్యమించడం ద్వారా ఒక ఏడాది విద్యా సంవత్సరాన్ని కోల్పోయామని చెప్పారు. 2001లో ప్రారంభమైన మలిదశ ఉద్యమంలో కూడా అప్పటి ఉద్యమకారులు తమ పూర్తి సహాయ సహకరాలను అందించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఉద్యమ నాయకత్వానికి సలహాలు, సూచనలు చేస్తూ ఉద్యమానికి దూరంగా ఉంటున్న వారిలో చైతన్యాన్ని నింపామని తెలిపారు. ఇంతచేసినా తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేకపోగా ఉద్యమంలో లేనివారిని ఉద్యమకారులుగా చిత్రీకరించి పెద్దపీట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి తొలిదశ ఉద్యమకారులను గుర్తించి వారిని, వారి కుటుంబాలను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఆదుకోవాలని కోవాలని కోరారు.