హైదరాబాద్

నేర నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఏప్రిల్ 28: నేరాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు సిసి కెమెరాలు ఎంతగానో దోహపడతాయని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఉమానగర్, కుందన్‌బాగ్, మెథడిస్ట్‌కాలనీవాసుల భాగస్వామ్యంతో రూ. 41 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 60 సిసికెమెరాల మానిటరింగ్ సిస్టమ్‌ను కమిషనర్ ప్రారంభించారు.
నగరవ్యాప్తంగా లక్ష సిసి కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రల్ సెంటర్‌కు అనుసందానం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నచోటే అభివృద్ధి అవకాశం ఉంటుందని, ధనికులకైన, పేదలకైనా ప్రభుత్వం తమకు పూర్తిరక్షణ అందిస్తుందన్న భవన ఉన్నప్పుడే ప్రశాంతంగా జీవించగలరని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే నగరం మొత్తం సిసి కెమెరాలు ఏర్పాటు చేసి నేరరహితనగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. తమ ప్రయత్నానికి నగరవాసులను నుంచి మంచి స్పందన లభిస్తుందని, సిసి కెమెరాలను భిగించేందుకు స్తోమతకు తగ్గట్టు సహాయం అందిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో డిసిసి వెంకటేశ్వరరావు, ఏసిపి వెంకటేశ్వర్లు, సిఐ మోహన్ కుమార్ పాల్గొన్నారు.