హైదరాబాద్

కళాకారులను ప్రొత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : కళాకారులను ప్రొత్సహిస్తేనే కళలు సజీవంగా బతుకుతాయని నగర మేయర్ సతీమణి ఆల్ యాదవ్ ఉమెన్స్ ఫ్రంట్ చైర్‌పర్సన్ బొంతు శ్రీదేవి యాదవ్ అన్నారు. ఉజ్వల దసరా సంస్కృతిక సంస్థ, కురుగంటి కళాక్షేత్రం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రుల ముగింపు సభ సోమవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బొంతు శ్రీదేవి పాల్గొని మళియాల భగవతి పీఠం స్వామిజీ శివ నరసింహ తాంత్రి స్వామి, దర్గా రమేష్, మహాంకాళి కృష్ణమూర్తి, జోగిని జ్ఞానికి ‘ఉజ్వల దసరా’ పురస్కారాలను ప్రదానం చేశారు. దేవి శరన్నవరాత్రులను పురస్కారించుకుని అమ్మవారి స్వరూపులైన జోగినిలను సత్కరించుకోవాడం సంతోషదాయకమని అన్నారు. కురుగంటి కళాక్షేత్రం అధ్యక్షురాలు కురుగంటి రాధిక మాట్లాడుతూ తొమ్మిది రోజులు దేవి శరన్నవరాత్రులను సందర్భంగా జోగినిలను గౌరవించుకోవాడం సంతోషంగా ఉందని వివరించారు. దైవజ్ఞ శర్మ సభాధ్యక్షత వహించగా అమెరికా తెలుగు సంఘం రీజినల్ కోఅర్డినేటర్ కే.కృష్ణారెడ్డి, సంస్థ అధ్యక్షురాలు ఎం.లక్ష్మీ, సంస్థ కల్చరల్ కోఅర్డినేటర్ సిద్ధూ, వాఖ్యాత కీర్తన పాల్గొన్నారు.
అలరించిన భక్తి సంగీత విభావరి
కాచిగూడ, అక్టోబర్ 7: ప్రముఖ సంగీత విద్వాంసుడు మంథా శ్రీనివాస్ శిష్య బృందంచే ‘్భక్తి సంగీత’ కార్యక్రమం కళానిలయం సాంస్కృతిక సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి కాచం ఫౌండేషన్ చైర్మెన్ కాచం సత్యనారాయణ గుప్త పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు. దేవి శరన్నవరాత్రులను పురస్కారించుకుని తొమ్మిది రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ నటి మోనాలిసాకు ఆత్మీయ సత్కరం చేశారు. కార్యక్రమంలో నృత్య గురువు ఎస్‌పీ భారతి, సంస్థ అధ్యక్షుడు ఎం.సురేందర్ పాల్గొన్నారు.