హైదరాబాద్

ఆక్యుపెన్సీతోనే ఆస్తిపన్ను వర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్‌ఎంసీకి ఆదాయ వనరులను సమకూర్చేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అంతర్గతంగా అందుబాటులో ఉన్న అన్ని ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. జీహెచ్‌ఎంసీకి రెండో ప్రధాన ఆర్థిక వనరైన భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయటంతో పాటు భవనం పూర్తయిన తర్వాత, భవనం మంజూరు చేసిన ప్లాన్ ప్రకారమే నిర్మించినట్లు నిర్థారించి అక్యుపెన్సీ సర్ట్ఫికెట్ జారీ చేసే సమయంలోనే ఆ భవనం ఆస్తిపన్నును అసెస్‌మెంట్ చేసి వడ్డించాలని భావిస్తున్నట్లు, త్వరలోనే ఈ ప్రక్రియను అమలు చేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ వెల్లడించారు. సోమవారం విలేఖర్లతో మాట్లాడుతూ ఇప్పటి వరకు నిర్మాణం పూర్తయిన భవనాలను ఆక్కుపై చేసుకునేందుకు ముందు యజమానికి అక్యుపెన్సీ సర్ట్ఫికెట్ జారీ చేసి, ఆ తర్వాత ఆస్తిపన్నును అసెస్‌మెంట్ చేసే పాత పద్దతికి స్వస్తి పలికి, అక్యుపెన్సీ సర్ట్ఫికెట్ ఇచ్చే సమయంలోనే భవన ఆస్తిపన్నును అసెస్‌మెంట్ చేసి వర్తింపజేయనున్నట్లు తెలిపారు. చాలా భవనాలు అక్యుపెన్సీ తీసుకున్న ఏళ్ల తర్వాత ఆస్తిపన్ను పరిధిలోకి రావటంతో జీహెచ్‌ఎంసీకి పన్నుపరంగా ఎంతో నష్టం ఏర్పడుతున్నట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. రోడ్ల విస్తరణ, ఎస్‌ఆర్‌డీపీ పనులు, కొత్త ప్రాజెక్టులు, నాలా విస్తరణలు వంటి ప్రాజెక్టు కోసం సేకరించే స్థలాలకు ప్రస్తుతం కార్పొరేషన్ నష్టపరిహారం చెల్లించే పరిస్థితుల్లో లేనందున ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్ (అభివృద్ధి హక్కు బదలాయింపు) సర్ట్ఫికెట్లను జారీ చేస్తున్నామని, దీనికి నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల యజమానుల నుంచి మంచి ఆదరణ వస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 350 టీడీఆర్ సర్ట్ఫికెట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
భూమి ధరలు, డిమాండ్ బాగా ఉన్న ప్రాంతాల్లో ఈ హక్కును అమ్ముకునే అవకాశం కూడా ఉండటంతో అమ్మాలనుకునే వారిని, కొనుగోలు చేయాలనుకున్న వారిని ఒక వేదికపైకి తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ‘టీడీఆర్ బ్యాంక్’ను ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు కమిషనర్ తెలిపారు. మహానగరంలో దోమలు, డెంగ్యూ వాధి ప్రభావం క్రమంగా తగ్గుతోందని వివరించారు. గతంలో రోజుకి వంద మంది అనుమానిత లక్షణాలతో ఆసుపత్రులను ఆశ్రయిస్తుండేవారని, కొద్దిరోజుల క్రితం ఈ సంఖ్య 50 నుంచి 60కు ఉండగా, ప్రస్తుతం కేవలం 25 మందిలో మాత్రమే అనుమానిత లక్షణాలు కన్పిస్తున్నాయని, ఇందుకు దోమలు, డెంగ్యూ నివారణకు తాము చేపట్టిన చర్యలే కారణమని వివరించారు. ప్రస్తుతం కూడా నగరంలో ఉన్న దోమల్లో కేవలం పది శాతం దోమల వల్ల మాత్రమే డెంగ్యూ వచ్చే అవకాశాలు ఉన్నాయని, దోమలు బాగా ఉత్పత్తి అవుతున్న 25 ప్రాంతాలను గుర్తించామని, అక్కడ కూడా దోమలను నివారించేందుకు చర్యలను ముమ్మరం చేశామని కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు.