హైదరాబాద్

యువతకు కలాం ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : నేటి యువతకు అబ్దుల్ కలాం స్ఫూర్తిదాయకమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు అన్నారు. భారతరత్న మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి అబ్దుల్ కలాం స్మారక ప్రతిభా పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం మానస ఆర్ట్స్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవులపల్లి ప్రభాకర రావు పాల్గొని పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, కృష్ణ, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రామచంద్ర రావు, రఘుశ్రీ పాల్గొన్నారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, అక్టోబర్ 15: అవని ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి మంగళవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు. ప్రముఖ గాయనీ విజయ నిర్వహణలో గాయనీ, గాయకులు మోహన కృష్ణ, చంద్రతేజ, సురేందర్, నందగోపాల్, నాగేశ్వర రావు, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, జ్యోతి, విమల, రామలక్ష్మీ, భారతి అలపించిన సినీ గీతాలు అలరించాయి. ట్రాన్స్‌పోర్ట్ మాజీ కమిషనర్ సీఎల్‌ఎన్ గాంధీకి ఆత్మీయ సత్కరం చేశారు. కార్యక్రమంలో మల్కాజ్‌గిరి జడ్జ్ బూర్గుల మధుసూదన్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, దైవజ్ఞశర్మ, కరకాల కృష్ణారెడ్డి, రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.