హైదరాబాద్

రెండు రోజులు నీటి సరఫరా బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరవాసుల దాహర్తిని తీర్చటంలో ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్న గోదావరి నుంచి నీటిని తరలించే పైప్‌లైన్‌ను మార్చే పనులను చేపట్టనుంది జలమండలి. ఈ పనుల కారణంగా మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ నెల 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ నుంచి ఉదయం వరకు నీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. తొలుత మూడు రోజుల పాటు నీటి సరఫరాను నిలిపివేయాల్సిన అవసరం వస్తుందని భావించిన అధికారులు ఆ తర్వాత పనులను 48 గంటల్లో పూర్తి చేసే అవకాశమున్నందున, పనులు జరుగుతున్నంత సేపు పలు ప్రాంతాలకు గోదావరి జలాల సరఫరాను నిలిపివేయనున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పథకం ప్యాకేజీ-13 కింద నీటి పారుదల శాఖ గ్రావిటీ కెనాల్ నిర్మాణం జరుగుతున్నందున, గజ్వేల్ మండల పరిధిలోని కోడకండ్ల గ్రామం వద్ధ నగరానికి వచ్చే గోదావరి 3000 ఎంఎం డయా ఎంఎస్ పైప్‌లైన్ ఈ కెనాల్ నిర్మాణానికి అడ్డుగా వస్తున్నందున, ఈ పైప్‌లైన్‌ను ఇతర చోటకు మార్చాలన్న నీటి పారుదల శాఖ అభ్యర్థన మేరకు జలమండలి అధికారులు ఈ పనులను చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పనులు జరిగినంత సేపు సరఫరాను షెట్‌డౌన్ చేయాల్సి ఉన్నందున, సరఫరా నిలిపివేయాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అభివృద్ధి పనులు, జలాల తరలింపు ప్రక్రియలో భాగంగా ఈ సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.