హైదరాబాద్

బల్దియాపై ఆర్టీసీ సమ్మె ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో ప్రజారవాణా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన ఆర్టీసి సమ్మె ప్రభావం జీహెచ్‌ఎంసీపై కూడా పడింది. ప్రస్తుతం ఆర్టీసి డ్రైవర్లు, కండక్టర్లు తమ న్యాయమైన డిమాండ్ల కోసం గడిచిన 11 రోజుల నుంచి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే! అప్పటి నుంచి నగరంలో ప్రజారవాణ వ్యవస్థ స్తంభించటంతో పాటు ఇపుడు ఈ సమ్మె ప్రభావం చెత్త తరలింపుపై కూడా పడుతోంది. ముఖ్యంగా సమ్మెలో ఉన్న ఆర్టీసి డ్రైవర్ల స్థానంలో ఆర్టీసి రోజుకి రూ.1500లను వేతనంగా చెల్లించి తాత్కాలిక డ్రైవర్లను నియమిస్తున్న సంగతి తెలిసిందే! హేవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్సు కలిగి, కనీసం రెండేళ్ల సీనియార్టీ ఉంటే చాలని ఆర్టీసి ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేయటంతో జీహెచ్‌ఎంసీలో ఔట్‌సోర్సు ప్రాతిపదికన పని చేస్తున్న కొందరు డ్రైవర్లు ఆర్టీసిలో తాత్కాలిక డ్రైవర్లుగా చేరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో చెత్త తరలించే వాహనాలను నడిపే డ్రైవర్లకు నెలకు రూ. 14వేల 500 మాత్రమే చెల్లిస్తూ, అందులో ఈఎస్‌ఐ, పీఎఫ్‌లు మినహా తమకు కేవలం రూ. 11వేల పై చిలుకు చేతికి అందుతోందని, దాంతో తాము ఎలా బతకాలని డ్రైవర్లు వ్యాఖ్యానిస్తున్నారు. తాత్కాలిక డ్రైవర్లకు ఆర్టీసి రోజు వారీ చెల్లిస్తున్న రూ. 1500కు ఆకర్షితులయ్యారని చెప్పవచ్చు. మొత్తం నెలరోజుల్లో నాలుగు, ఐదు సెలవులు మినహా ఆరున్నర వేల నుంచి ఏడున్నర వేలు మినహా కనీసం తమకు నెలకు రూ. 30వేల సంపాదించుకునే అరుదైన అవకాశంగా మరికొందరు డ్రైవర్లు భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు డ్రైవర్లు ఆర్టీసిలో చేరటంతో జేబీఎస్, లోయర్‌ట్యాంక్‌బండ్, యూసుఫ్‌గూడ ట్రాన్స్‌ఫర్ స్టేషన్లలో కొన్ని వాహానాలకు బ్రేక్ పడినట్లు సమాచారం. పైగా జీహెచ్‌ఎంసీ చెత్త తరలించేందుకు వినియోగిస్తున్న వాహనాలన్నీ డొక్కుగా మారటం, వాహనంలో టన్నుల కొద్ధీ చెత్తను తీవ్ర దుర్గంధం మధ్య తరలిస్తున్నా, తమకు కనీస గుర్తింపు లేదని, పైగా పై స్థాయి అధికారులు, కాంట్రాక్టర్లు చేసే అక్రమాలు, అవకతవకలకు తమను బలి పశువులను చేస్తున్నందున, జీహెచ్‌ఎంసీ కన్నా మూడింతలు ఎక్కువ జీతమిస్తున్న ఆర్టీసిలో చేరటమే బెటర్ అని మరికొందరు డ్రైవర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్టీసిలో తాత్కాలిక డ్రైవర్లకు రోజుకి రూ. 1500 చెల్లించటం గొప్ప విషయమే కదా! అని కొందరు డ్రైవర్లు వ్యాఖ్యానించారు. ఈ రకంగా ఆర్టీసిలో తాత్కాలిక డ్రైవర్లుగా చేరేందుకు వస్తున్న వారితో సికిందరాబాద్ జేబీఎస్‌లో సందడి నెలకొంది.