హైదరాబాద్

18న జాబ్ మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 18న నగరంలో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ఉపాధి, శిక్షణా సంస్థ, ఉస్మానియా యూనివర్శిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ బ్యూరో డిప్యూటీ చీఫ్ అధికారి ఎన్.అనంత రెడ్డి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 18న యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్‌లోని కెరియర్ సెంటర్‌లో ఈ జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రైట్ డేటా సొల్యూషన్, బేసిక్స్ సబ్ కే ఐ ట్రన్సాక్షన్ వంటి ప్రైవేట్ కంపెనీల్లో హైదరాబాద్‌లో పనిచేసేందుకు సుమారు 150 ఉద్యోగాల ఎంపికను ఈ జాబ్‌మేళాలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు, ఆధార్ ఆపరేటర్, కస్టమర్ సర్వీస్ రిప్రంజేటేటీవ్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు జీతం చెల్లించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలని సూచించారు. ఫోన్ నెంబర్ 8247656356లో సంప్రదించాలని వెల్లడించారు.