హైదరాబాద్

రోడ్ల తవ్వకాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరంలో మూడు నెలల నుంచి వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ అస్తవ్యస్తమయ్యాయి. వీటికి మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నందున, ఇప్పటికే రోడ్ల తవ్వకాలపై అమలు చేస్తున్న నిషేధాన్ని మరో నెలరోజుల పాటు పొడిగిస్తున్నట్లు సిటీ సమన్వయ కమిటీ సమావేశం తీర్మానించింది. శనివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సిటీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ మాట్లాడుతూ హైరాబాద్ నగరంలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినందున ఈ నెల 22వ తేదీ నంచి నవంబర్ 10వ తేదీలోపు రోడ్లపై గుంతలను పూడ్చటం, రోడ్లకు మరమ్మతులను చేపట్టడం వంటి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇందుకు గాను జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో బీటీ మిక్సింగ్ కేంద్రాలు ఇరవై నాలుగు గంటల పాటు పనిచేస్తాయని వివరించారు. వీటితో పాటు నవంబర్ నుంచి నగరంలో తక్షణ మరమ్మతుల బృందాలను కూడా రంగంలో దింపనున్నట్లు వెల్లడించారు. నగరంలో దాదాపు 680 కిలోమీటర్ల ప్రధాన రహదారులను వార్షిక నిర్వాహణ పద్దతిలో కాంట్రాక్టుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినందున అంత్గరత రహదారుల నిర్వహణను పూర్తి స్థాయిలో పకడ్బందీగా చేపట్టాలని జీహెచ్‌ఎంసీ రోడ్ల మెయింటనెన్స్ విభాగాన్ని ఆదేశించినట్లు తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో అత్యవసర పనుల నిమిత్తం జలమండలి ఆధ్వర్యంలో జరిగిన తవ్వకాలకు తాత్కాలిక మరమ్మతులను చేపట్టాలని కోరినట్లు కమిషనర్ తెలిపారు.
నగరంలో ఇంకా వర్షాలు అడపాదడపా కురుస్తున్నందున నగరవాసుల ప్రయోజనం కోసం రోడ్లపై తవ్వకాలను మరో నెలరోజుల పాటు నిషేధిస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. కేబుళ్లు, పైప్‌లైన్లు ఇతర అవసరాల కోసం రోడ్ల తవ్వకాలను నవంబర్ 1వ తేదీ నుంచి అనుమతులను జారీ చేయాలని గతంలో భావించినా, ఈ నిషేధాన్ని డిసెంబర్ 1వ తేదీ వరకు ఈ నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ డీసీపీ చౌహాన్, ఎస్‌పీడీసీఎల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు సిక్తాపట్నాయక్, అద్వైత్‌కుమార్‌సింగ్, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, చీఫ్ ఇంజనీర్లు సురేశ్, జియావుద్ధిన్, చీఫ్ సిటీ ప్లానర్ ఎస్. దేవేందర్‌రెడ్డి, జలమండలి డైరెక్టర్ కృష్ణ తదితరులు హాజరయ్యారు.
‘డబుల్’ఇళ్ల మరో రెండు ఎకరాలు
జూబ్లీహిల్స్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి మరో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ రవిని కమిషనర్ కోరగా. ఈ భూమిని డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేటాయించేందుకు సంబంధిత ఆర్టీఓ నివేదికను పంపారని, త్వరలో ఈ భూమి కేటాయింపు ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు. సమీపంలోని ఖాళీ స్థలాన్ని కూడా కమ్యూనిటీ హగాల్ నిర్మాణానికి కేటాయించాలని కమిషనర్ జేసీని కోరారు.
పార్కులకు ఇరవై ఎస్‌టీపీల నీళ్లు
నగరంలో జీహెచ్‌ఎంసీకి చెందిన పార్కులకు 20 ఎస్‌టీపీల్లో శుద్ధి అవుతున్న నీటిని వినియోగించాలని సిటీ సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయించింది. పార్కులకు ఐదు కిలోమీటర్ల సమీపంలో ఉన్న వాటికి ప్రత్యేక పైప్‌లైన్ నిర్మించి నీటిని తరలించాలని గతంలో నిర్ణయించినప్పటికీ అధిక వ్యయం, నిర్వాహణలో గల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఓల్డ్ ముంబై హైవేలో క్యారేజీ వే కు అడ్డంకిగా ఉన్న మూడు ఆలయాలను సమీపంలోకి తరలించి, పునఃనిర్మించేందుకు కావల్సిన భూమిని గుర్తించామని రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి తెలిపారు.