హైదరాబాద్

దుగ్గిరాల ఆత్మీయ రంగస్థల పురస్కారాలు ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : ప్రముఖ రంగస్థల నటుడు దుగ్గిరాల సోమేశ్వర రావు జన్మదినోత్సవ సందర్భంగా ‘దుగ్గిరాల ఆత్మీయ రంగస్థల పురస్కారాలు’ ప్రదానోత్సవ కార్యక్రమం దుగ్గిరాల ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి పాల్గొని పురస్కారాలను ప్రదానం చేశారు. దుగ్గిరాల నాటక రంగనికి అనేక సేవలను అందించారని కొనియాడారు. దుగ్గిరాల సోమేశ్వర రావు జన్మదినోత్సవం సందర్భంగా నాటక కళాకారులను ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం, ప్రముఖ నటుడు రావి కొండల రావు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
కాచిగూడ, అక్టోబర్ 20: బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించి వారికి ‘బెస్ట్ చాంపియన్ వరల్డ్’ రికార్డు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి మల్కాజ్‌గిరి జడ్జ్ బూర్గుల మధుసూదన్, ప్రముఖ సామాజిక వేత్త డా.కొత్త కృష్ణవేణి, శంకర వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్ర ప్రసాద్, సంస్థ అధ్యక్షుడు వీక్కీ మాస్టర్ పాల్గొని వివిధ రంగాల్లో సేవలందించి వారికి అవార్డులను ప్రదానం చేశారు. కళాకారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.