హైదరాబాద్

వర్షంతో స్తంభించిన ట్రాఫిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం పూర్తిగా మారిపోయింది. దట్టమైన మోఘాలు కమ్ముకొని మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు నగరవ్యాప్తంగా వర్షం కురిసింది. సనత్‌నగర్, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడ, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, నెరేడ్‌మెట్ ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ స్థాయిలో వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లోని రహదారులపై నీరు నిలిచిపోయింది. మెహిదీపట్నం లక్డీకపూల్ రూట్‌లో వాహనాల రాకపోకలకు స్వల్ప ఇబ్బందులు ఏర్పడ్డాయి. అమీర్‌పేట ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మారేడ్‌పల్లి ప్రాంతంలో రహదారులు జలమయం కాగా వాహనాలు నెమ్మదిగా సాగాయి. వర్షం కురిసే అవకాశం ఉందని తెలిసిన క్షణాల వ్యవధిలోనే జీహెచ్‌ఎంసీ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలను ప్రారంభిస్తున్నారు. రోడ్లపై నిలిచిన నీటిని ప్రత్యేక మోటర్ల సహాయంతో తోడి పోస్తున్నారు.