హైదరాబాద్

‘పాట పరమళించి వేళ’ పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : ప్రముఖ సాహితీవేత్త చిమ్మపూడి శ్రీరామమూర్తి రచించిన ‘పాట పరిమళించిన వేళ’ గ్రంథావిష్కరణ సభ చిమ్మపూడి ఫౌండేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. చిమ్మపూడి శ్రీరామమూర్తి సాహిత్య రంగానికి ఎనలేని సేవలను చేశారని పేర్కొన్నారు. చిమ్మపూడి ఫౌండేషన్ నూతన సంస్థను ఏర్పాటు చేసి సాహిత్య సేవలను చేయడం అభినందనీయమని అన్నారు. వివిధ రంగాల్లో సేవలందించిన వారికి చిమ్మపూడి స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. ఏనుగు నరసింహా రెడ్డి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఎన్‌టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్‌పర్సన్ డా.నందమూరి లక్ష్మీపార్వతి, నంది అవార్డు గ్రహీత హెచ్‌వీఎల్ ప్రసాదు బాబు, ప్రముఖ సంగీత దర్శకుడు విన్నకోట మురళీకృష్ణ, సంస్థ కార్యదర్శి చిమ్మపూడి వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు.