హైదరాబాద్

స్తంభించిన ట్రాఫిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : మహానగరంలో ఎటుచూసినా ట్రా‘్ఫకరే’. ఇదివరకు కేవలం వర్షం కురిసినపుడు మాత్రమే మెయిన్‌రోడ్లు, నిత్యం రద్ధీగా ఉండే జంక్షన్లలో ట్రాఫిక్ స్తంభించేది. కానీ ప్రస్తుతం నగరంలో పరిస్థితుల కారణంగా మెయిన్‌రోడ్లే గాక, సబ్ రోడ్లు, కాలనీ రోడ్లు కూడా ట్రాఫిక్ జాం అవుతున్నాయి. ఇందుకు వాహనదారులకు ట్రాఫిక్ సెన్స్ లేకపోవటం, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించటంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహారించటం, రోడ్లన్నీ గుంతలమయంగా తయారు కావటంతో వాహనాలు మెల్లిగా ముందుకు కదులుతుండటం వంటి కారణాల నేపథ్యంలో ఏ రోడ్డు చూసినా ట్రాఫిక్ జాం దర్శనమిస్తోంది. ఇదంతా ఇప్పటివరకున్న పరిస్థితి. కానీ సోమవారం ఆర్టీసి సమ్మెకు మద్దతునిస్తూ, కార్మికులకు ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించటంతో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య మరింత స్తంభించింది. మామూలు సమయంలోనే తరుచుగా ఈ రోడ్డుపై ట్రాఫిక్ జాం అవుతోంది. ఈ క్రమంలో సోమవారం విపక్షాలు ప్రగతిభవన్‌ను ముట్టించే యత్నం చేయటంతో భారీగా పోలీసులు మోహరించటం, వారు విపక్షాలకు చెందిన నేతలను ఎక్కడికక్కడే అడ్డుకోవటంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ముఖ్యంగా బేగపేట మెయిన్‌రోడ్డు, పరిసర ప్రాంతాలైన సోమాజీగూడ చౌరస్తా, అమీర్‌పేట, బల్కంపేట, పంజాగుట్ట, శ్యాంలాల్‌బిల్డింగ్, బేగంపేట రెండు ఫ్లైఓవర్లలో గంటల తరబడి ట్రాఫిక్ జాం ఏర్పడింది. విపక్షాలు ముట్టించేందుకు వచ్చినపుడు పోలీసులు అడ్డుకుంటున్న సమయంలో ఒక్కో ఫ్లైఓవర్‌పై వాహనదారులు సుమారు 45 నుంచి 50 నిమిషాల వరకు ప్రయాణించాల్సి వచ్చింది. సంజీవరెడ్డినగర్, ఫతేనగర్, అమీర్‌పేట, బల్కంపేట తదితర ప్రాంతాల నుంచి ఖైరతాబాద్, లక్డీకాపూల్ ప్రాంతాలకు వచ్చే వారు బేగంపేట వరకు వెళ్లి, మినిష్టర్ రోడ్డు, నెక్లెస్‌రోడ్డుల మీదుగా ఖైరతాబాద్ చౌరస్తా మీదుగా తమ గమ్యస్థానాలను చేరుకున్నారు. పంజాగుట్ట చౌరస్తా నుంచి అటు ఖైరతాబాద్, బంజారాహిల్స్ ప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లోనే నిల్చిపోయాయి. ఇదిలా ఉండగా, నిన్నమొన్నటి వరకు కురిసిన వర్షాలకు ఇప్పటికే రోడ్లు గుంతలమయమైన లక్డీకాపూల్, మాసాబ్‌ట్యాంక్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, పంజాగుట్ట, ఏసీ గార్డ్స్ తదితర ప్రాంతాల్లో రోడ్డుకు ఒక పక్కన తవ్వేసి వదిలేయటంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమైంది.