హైదరాబాద్

సంక్షోభంలో ఉన్న కాటన్ పరిశ్రమను ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందక సంక్షోభంలోకి నెట్టబడుతున్న కాటన్ పరిశ్రమను ఆదుకోవాలని తెలంగాణ కాటన్ మిల్లర్స్ ట్రేడర్స్ వేల్ఫేర్ అసోసియేషన్ (టీసీఎంటీడబ్ల్యూఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్ రెడ్డి, రమేష్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పండుతున్న పత్తిని రైతులకు మద్దతు ధర చెల్లించి పరిశ్రమలను నడుపుతున్న వారి పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు అప్పటి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో పరిశ్రమలు అదనపు లోడుతో ఉన్న విద్యుత్‌ను వినియోగించారని పీనల్ చార్జీలను వేశారని చెప్పారు.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో తమ గోడును విన్నవించుకోగా విద్యుత్ పీనల్ చార్జీలను రద్దు చేస్తామని ఇచ్చిన హామీ ఇచ్చారని చెప్పారు. అరేళ్లుగా విద్యుత్ పీనల్ చార్జీల సమస్యను పరిష్కరించాలని మంత్రులు, విద్యుత్ అధికారులు, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. దేశంలోనే అత్యుత్తమ విధానాలతో రూపకల్పన చేసిన టీఎస్ ఐపాస్ ద్వారా కాటన్ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని నమ్మబలికారని చెప్పారు. ఇది నిజమని నమ్మి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా మద్దతు ధర చెల్లించి పత్తిని కొనుగోలు చేసి మరీ పరిశ్రమలను నడిపిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ హామీ మేరకు ప్రోత్సాహకంగా అందాల్సిన నిధులు రాకపోవడంతో పరిశ్రమలు ఖాయిలా దిశగా పయనిస్తున్నాయని వాపోయారు. అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన వరంగల్‌కు చెందిన కాటన్ పరిశ్రమ యజమాని పరిశ్రమలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పటికే పరిశ్రమలను స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే పరిస్థితి మరింత అద్వానంగా తయారు అయిందని, తమ బాధలు వినేవారే లేకుండా పోయారని కన్నీరుపెట్టుకున్నారు. దీపావళిలోపు స్పందించకపోతే రాష్టవ్య్రాప్తంగా నిరసన కార్యక్రమాలకు సిద్దం అవుతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు శ్రీ్ధర్ రెడ్డి, శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, రాజు, మల్లారెడ్డి పాల్గొన్నారు.