హైదరాబాద్

ఓటరు వెరిఫికేషన్ పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరానికి ఎలాంటి తప్పుల్లేని ఓటరు జాబితాను రూపకల్పన చేసేందుకు ప్రస్తుతం చేపట్టిన ఓటరు వెరిఫికేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్లకు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఓటరు వెరిఫికేషన్ కార్యక్రమంపై ఆయన మంగళవారం జాయింట్ చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ రవికిరణ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో ఒకటికన్నా ఎక్కువ సార్లు ఓటరుగా నమోదు చేసుకున్న ఓటరు వివరాలను గుర్తించి, నిర్ణీత ప్రక్రియ ద్వారా తొలగించాలని ఆదేశించారు. ఓటరు వెరిఫికేషన్, ఒకటి కన్నా ఎక్కువ సార్లు నమోదు చేయబడ్డ ఓటర్ల వివరాల గుర్తింపు ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు ఇంకా సిబ్బంది అవసరమైనా, కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కమిషనర్ వివరించారు. ఒకటి కన్నా ఎక్కువ సార్లు నమోదై ఉన్న ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎంతో జాగ్రత్తగా తొలగించాలని సూచించారు.
ఓటును తొలగించే విషయంలో ప్రతి ఎలక్ట్రోల్ ఆఫీసర్ నిర్ణీత ప్రక్రియలో మాత్రమే తొలగించాలని, నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని సూచించారు.
తొలగించాల్సిన ఓటు వివరాలకు సంబంధించిన ఓటరు స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేసి, డిలీట్ చేస్తున్న ఫైల్‌తో భద్రపర్చాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు పాల్గొన్నారు.