హైదరాబాద్

పూడిక సాగదీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: వర్షాకాలంలో నగరాన్ని వరద ముప్పు నుంచి రక్షించేందుకు ఎండాకాలం ముగిసేలోపు నగరంలోని అన్ని ప్రధాన నాలాల్లోని పూడికతీత పనులను పూర్తి చేయాల్సి ఉంది. పదహారేళ్ల క్రితం నగరాన్ని వరదలు ముంచెత్తినపుడు నగరాన్ని వరద ముప్పు నుంచి రక్షించేందుకు తీసుకోవల్సిన చర్యలను అనే్వషిస్తూ కిర్లోస్కర్ కమిటీ చేసిన అధ్యయనం ప్రకారం వర్షాకాలానికి ముందు అన్ని నాలాల్లో పూడికతీత పనులు పూర్తి చేసుకోగలిగితే ఎంత వర్షం కురిసినా, నగరానికెలాంటి ప్రమాదం ఉండబోదని కిర్లోస్కర్ కమిటీ చేసిన సిఫార్సులు స్వరాష్ట్రం, స్వపరిపాలనలో ఈ సారైనా కొంత ఆశించిన స్థాయిలో అమలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
కొద్ది నెలల క్రితం మున్సిపల్ మంత్రిగా కెటిఆర్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, ఫిబ్రవరిలో అందుబాటులోకి వచ్చిన పాలక మండలితో కలిసి నగరంలోని వివిధ నాలాలను సందర్శించిన ఆయన నాలాల పూడికతీత పనులకు రూ. 24 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే అధికారులు టెండర్ల ప్రక్రియను చేపట్టి, పనులు ఖరారు చేశారు. ఆ తర్వాత మంత్రి కెటిఆర్ అధికారులతో తరుచూ సమీక్షలు నిర్వహించటంతో పనులు కాస్త ముందుకు సాగుతున్నాయి. లేని పక్షంలో గతంలో మాదిరిగా కేటాయించిన నిధులు కరిగిపోయి, నాలాల్లో పూడిక అలాగే మిగిలిపోయేదన్న విమర్శలున్నాయి. గ్రేటర్ పరిధిలోని 321 ప్రధాన నాలాలు, వర్షపు నీటి కాలువలను పూడికతీయటానికి జిహెచ్‌ఎంసి పెద్ద ఎత్తున పనులు చేపట్టింది. ఇందుకు గాను రూ. 24 కోట్ల 48లక్షల అంచనా వ్యయంతో మొత్తం 721 కిలోమీటర్ల పొడువు కల్గిన నాలాల్లో చేపట్టిన పూడికతీత పనుల్లో 321 పనులు మే నెలాఖరులోగా పూర్తి చేసే దిశగా అధికారులు పనులు చేపడుతున్నారు. పనుల్లో పారదర్శకత కోసం ఇప్పటికే మంజూరు చేసి, చేపడుతున్న పనుల వివరాలను జిహెచ్‌ఎంసి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ పనులకు సంబంధించి డ్రెయిన్ల పొడువుతో పాటు వాటిలో ఉన్న పూడిక వివరాలను కూడా డ్రెయిన్ల కొలుత వేయిస్తున్నామని, ఈ పనులకు ముందు, పనులు పూర్తయిన తర్వాత వేర్వేరుగా ఫొటోలు కూడా తీస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. పూడికను తరలించే వాహనాలకు జిపిఎస్, వోఎస్‌ఆర్టీ విధానంతో రాకపోకలు కొనసాగిస్తున్నారు. పూడికతీత, తరలింపు పనులు మరింత పారదర్శకంగా సాగేందుకు వీలుగా ఈ పనులను స్థానిక కార్పొరేటర్లు, స్థానికుల నుంచి పనులు ముగిసిన తర్వాత సంతకాలు కూడా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 159 పూడికతీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, ఈ పనులను కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పర్యవేక్షిస్తున్నారని వివరించారు.
పారదర్శకంగా పనులు
నగరంలోని జరుగుతున్న నాలా పూడికతీత పనులు పారదర్శకంగా కొనసాగుతున్నట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి వివరించారు. పూడికను తరలించే వాహనాల బరువును జవహర్‌నగర్‌లోని వే బ్రిడ్జి ద్వారా లెక్కించడం జరుగుతుందని తెలిపారు. ఈ పూడికతీత పనులకు ముందు, పూర్తయిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ విభాగంచే తనిఖీలు చేయిస్తున్నట్లు ఆయన చెప్పారు. సంబంధిత జోనల్ కమిషనర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లతో సహా సంబంధిత ఇంజనీర్లు ఈ పూడికతీత పనులను సకాలంలో పూర్తయ్యేలా ఎప్పటికపుడు పర్యవేక్షించాలని ఆదేశించినట్లు కమిషనర్ పేర్కొన్నారు.