హైదరాబాద్

రెవెన్యూ ఉద్యోగుల విధుల బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎమ్మార్వో విజయారెడ్డి హత్యను నిరసిస్తూ రెవెన్యూ ఉద్యోగులను విధులను బహిష్కరించటంతో నగరంలో రెవెన్యూ సేవలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా నగరంలోని 16 మండల తహశిల్దార్ ఆఫీసులకు సిబ్బంది తాళాలు వేసి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ ఎమ్మార్వో విజయారెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ పరిపాలనాధికారి అశోక్‌రెడ్డి, ట్రెసా రాష్ట్ర నాయకుడు నిరంజన్‌రావులు మాట్లాడుతూ విజయారెడ్డి హత్యతో రెవెన్యూ ఉద్యోగులు విధులు నిర్వర్తించేందుకు భయాందోళనకు గురవుతున్నారని, ఇప్పటి వరకు ఆసిఫ్‌నగర్ మండలంలో కూడా సిబ్బందిపై దాడులు జరిగాయని వివరించారు. రెవెన్యూ ఉద్యోగులకు ప్రత్యేకంగా భద్రత కల్పించాల్సిన అవసరముందని అన్నారు. తాళాలు వేసి ఉన్న ఆఫీసుల చుట్ట్టూ జనం వివిధ పనుల కోసం వచ్చి ప్రదిక్షణలు చేస్తున్నారు. ఎక్కువ మంది ఆసరా పెన్షన్లు, కుల, ఆదాయ ధృవీకరణ, వారసత్వ సర్ట్ఫికెట్లతో పాటు ఇతర రెవెన్యూ సేవల కోసం నగరంలోని తహశిల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రతిరోజు వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. మండల, జిల్లా స్థాయిలోని పలు రెవెన్యూ ఆఫీసులకు కొందరు సిబ్బంది హాజరవుతున్నా, వారు కూడా నల్లబాడ్జిలను ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ మొదటి వారం కావటంతో ఆసరా, వృద్దాప్య, వితంతు, ఒంటరి మహిళా పెన్షన్ల కోసమే వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు పలువురు విద్యార్థులు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ఇప్పటికే దరఖాస్తులు సమర్పించి నెలలు గడుస్తున్నా, ఇంకా సర్ట్ఫికెట్లు అందలేదని వాపోతున్నారు. మరోవైపేమో కాలేజీ యజమాన్యాలు సర్ట్ఫికెట్ కోసం పట్టుబట్టినట్లు విద్యార్థులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే పెన్షన్లు, హౌజింగ్, రుణాలు, ఉపాధి తదితర అంశాలకు సంబంధించి ఇదివరకే ప్రజావాణిలో ఫిర్యాదులు, ఆర్జీలు అందించినా, తమకు పరిష్కారం సమకూరలేదని మరికొందరు వాపోతున్నారు.