హైదరాబాద్

17న సబ్బండ వర్గాల మహాదీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈ నెల 17న సబ్బండ వర్గాల మహాదీక్ష చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు తీర్మాణించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేదల వేదిక ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దత్తుగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిధులుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్, సామాజిక వేత్త జేబీ రాములు, మాజీ మంత్రి రవీంద్ర నాయక్, వివిధ సంఘాల నాయకులు మహేశ్వర్ రాజ్, పాలడుగు అనిల్ కుమార్, దీపక్, మన్నారం నాగరాజు, సురేష్ హాజరై మాట్లాడారు. వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్టీసీ ఆస్తులను అమ్ముకొని, వారి వర్గాలకు అప్పగించేందుకే కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి ఆర్టీసీని అమ్ముకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రి సమ్మెను సాకుగా చూపి ప్రైవేటీకరణ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నాడని దుయ్యబట్టారు. ఉద్యమ సమయంలో దేవుళ్లలా కనిపించిన ఆర్టీసీ కార్మికులు నేడు దయ్యాలా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మెకు మొదటి రోజు ప్రజల మద్దతు లభించక పోయినా అనంతరం ఆర్టీసీ కార్మికులు చేస్తున్నది స్వార్థం కోసం కాదు, ప్రజా రవాణను పరిరక్షించుకునేందుకే అని అర్ధం చేసుకొని మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు. బడుగు, బలహీన వర్గాలు అధికంగా పనిచేసేది ఆర్టీసీలోనే, ఆయా వర్గాలు ప్రయాణించేది ఆ బస్సుల్లోనే అంతటి ప్రాధాన్యం ఉన్న ఆర్టీసీ పరిరక్షించుకునేందుకు అన్ని వర్గాల వారిని సన్నద్దం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చిన తెలంగాణలో నిర్భంధకాండను కొనసాగిస్తున్నారని అన్నారు. కేసీఆర్ పరిపాలనలో మనసు చంపుకున్న వారే మంత్రులుగా కొనసాగుతారని అన్నారు. హోంమంత్రి హోంగార్డును కూడా బదిలీ చేయలేరని, వైద్య శాఖ మంత్రి ఏఎన్‌ఎంను సైతం బదిలీ చేయలేరని రాములు నాయక్ దుయ్యబట్టారు. 14 ఏళ్ల ప్రజా ఉద్యమ కాలం నాలుగేళ్లలా గడిచిపోగా, నాలుగు ఏళ్లు అధికారంలో ఉన్న సమయం 40 ఏళ్లలా అనిపిచిందని అన్నారు. స్వేచ్ఛగా పనిచేయలేని చోట ఉండటం సరికాదని నిర్ణయించుకొని టీఆర్‌ఎస్‌ను వీడినట్టు చెప్పారు. ప్రజలను, న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్న మంత్రి పువ్వాడ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రగాడి ప్రాణం చిలుకలో ఉన్నట్టు కేసీఆర్ ప్రాణం చిన్నజీయార్ స్వామి, మైహోం రామేశ్వర్ రావు, మెగా కృష్ణారెడ్డి వద్ద ఉందని, వారి ఇళ్ల ఎదుట నిరసన వ్యక్తం చేస్తే ఆర్టీసీ సమ్మెకు ముగింపు వస్తుందని పేర్కొన్నారు.
ప్రైవేటీకరణ కార్మికులతో పాటు యావత్ తెలంగాణ సమాజంపై తీవ్ర ప్రభావం చూపనుండటంతో ప్రజల్లో విస్తృత చైతన్యం కలిగించాలని, ప్రస్తుతం సంఘీభావం ప్రకటిస్తున్న ప్రజలను కార్మికులకు మద్దతుగా రోడ్లపైకి తీసుకువస్తే క్షణాల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుందని మంద కృష్ణ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 17న లక్షలాది మందితో నగరంలో సబ్బండ వర్గాలతో మహాదీక్ష చేపట్టాలని, 18న జరిగే సడక్ బంద్‌లో పాల్గొని, 20న గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ కుట్రను వివరించాలని తీర్మానించారు.