హైదరాబాద్

మరో మూడు రోజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో కొద్దిరోజుల క్రితం వరుసగా కురిసిన వాన జల్లులకు రోడ్లన్నీ గుంతలమయంగా తయారైన సంగతి తెలిసిందే! వీఐపీ జోన్‌లోని కొన్ని రోడ్లకు స్వల్పంగా మరమ్మతులు చేపట్టిన జీహెచ్‌ఎంసీ నగరంలోని 709 కిలోమీటర్ల రోడ్ల నిర్వహణ బాధ్యతను ఐదేళ్ల పాటు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తూనే, మిగిలిన రోడ్లపై ఏర్పడి గుంతలను పూడ్చేందుకు అధికారులు ఈ నెల 15వరకు గడువును విధించారు. తొలుత ఈ గుంతలన్నీ పూడ్చేందుకు ఈ నెల 10వ తేదీ వరకు కమిషనర్ గడువు విధించగా, దీన్ని ఈ నెల 15కు పొడిగించారు. రోడ్లపై గుంతలన్నీ ఈ నెల 10వ తేదీ వరకు పూడ్చేయాలని కమిషనర్ డెడ్‌లైన్ విధించక ముందే నగరంలోని మాసాబ్‌ట్యాంక్, ఏసీ గార్డ్స్‌లోని పీటీఐ వరకు రోడ్డు పునఃనిర్మించిన జీహెచ్‌ఎంసీ అధికారులు అక్కడి నుంచి సమీపంలోనే గుంతలపై ఉన్న రోడ్లకు ఇంకా మరమ్మతులు చేపట్టలేదు. అలాగే ఇక్బాల్ మినార్ నుంచి లక్డీకాపూల్ చౌరస్తాకు వెళ్లే దారి మొత్తం గుంతలమయంగా తయారైంది. అలాగే లక్డీకాపూల్ రెయిన్ బో హాస్పిటల్ నుంచి సంత్ నిరంకారి భవన్ వరకు వెళ్లే మెయిన్ రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారటంతో వాహానాలు మెల్లిగా ప్రయాణించటంతో తరుచూ ట్రాఫిక్ జాం అవుతోంది. లక్డీకాపూల్ లక్కీ హోటల్ నుంచి ఉడ్‌బ్రిడ్జికి వెళ్లే దారి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఈ రోడ్డు ఇప్పటికే పూర్తిగా గుంతలమయం కావటానికి తోడు రోడ్డుకు మధ్య మ్యాన్‌హోళ్లు ఉండటం వాహనదారులకు ఇబ్బందులు రెట్టింపయ్యాయి.