హైదరాబాద్

నేడే ఆఖరి రోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: మహానగర పాలక సంస్థకు ప్రధాన ఆర్ధిక వనరైన ఆస్తిపన్నులో రిబేటు పొందేందుకు నేటితో గడువు ముగియనుంది.
ఎప్పటికపుడు పన్ను వసూళ్లను పెంచుకునేందుకు కార్పొరేషన్ ఎప్పటికపుడు సరికొత్త ప్రయత్నాలు చేస్తోంది. వర్తమాన ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్న బకాయిలను ఈ ఏడు మొదటి నెల అయిన ఏప్రిల్ మాసంలోపు చెల్లిస్తే చెల్లించాల్సిన మొత్తంలో అయిదు శాతాన్ని రిబేటు ఇస్తున్న సంగతి తెలిసిందే! ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్న ఈ ‘ఎర్లీబర్డ్ స్కీం’తో శుక్రవారం సాయంత్రానికల్లా జిహెచ్‌ఎంసికి రూ. 156 కోట్ల 2.08లక్షల పన్ను వసూలైనట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం కూడా ఈ ఎర్లీబర్డ్ స్కీంను అమలు చేసిన జిహెచ్‌ఎంసి ఈ సారి మరింత ఎక్కువ వసూళ్లను సాధించేందుకు గాను ఇప్పటికే గ్రేటర్ పరిధిలో గల 24 సర్కిళ్లలోని సిటిజన్ సర్వీసు సెంటర్లలో బకాయిదారుల సౌకర్యార్థం ప్రత్యేకంగా అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అంతేగాక, మరికొన్ని కేంద్రాల్లో బకాయిదారులు ఎండ బారిన పడుకుండా ఉండేందుకు తాత్కాలిక ఏర్పాట్లును సైతం చేశారు. దీనికి తోడు కమిషనర్ ఈ సారి సెలవురోజుల్లోనూ సిటిజన్ సర్వీసు సెంటర్ల సిబ్బంది, ట్యాక్సు విభాగం సిబ్బంది విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక, గతంలో మధ్యాహ్నం మూడుగంటలకు మూతపడే సిటిజన్ సర్వీసు సెంటర్లు రాత్రి వరకు కూడా పనిచేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎర్లీబర్డ్ స్కీం కింద ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించి అయిదు శాతం రిబేటు పొందేందుకు నేటితో గడువు ముగియనుండటం, అంతేగాక, ఈ వారం చివరి పనిరోజు కావటంతో ఎక్కువ మొత్తంలో బకాయిదారులు ఈ స్కీంను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి సూచించారు. చివరి రోజైన శనివారం ఒక్కరోజే రూ. పది కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు వసూలయ్యే అవకాశముందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇదిలా ఉండగా, అపెక్స్ బ్యాంకు తెలంగాణ కార్పొరేషన్ వర్తమాన ఆర్థిక సంవత్సరానికి (2016-17) జిహెచ్‌ఎంసికి బకాయి పడ్డ ఆస్తిపన్ను రూ. 40.5 లక్షల మొత్తాన్ని శుక్రవారం కమిషనర్ జనార్దన్ రెడ్డికి ఆ కార్పొరేషన్ అధికారులు చెల్లించారు. ఎర్లీబర్డ్ స్కీంను ఆస్తిపన్ను బకాయిదారులంతా సద్వినియోగం చేసుకుని పన్నులో రిబేటును పొందటంతో పాటు ఆస్తిపన్ను చెల్లించి నగర సర్వతోముఖాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ సూచించారు.