హైదరాబాద్

సమాజ చైతన్యానికి ఇనాక్ రచనలు దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ : పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ రచనలు సమాజ చైతన్యానికి దోహద పడుతాయని హిమచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రముఖ సాహితీవేత్త కొలకలూరి ఇనాక్ రచించిన ‘చలన సూత్రం’ పుస్తకావిష్కరణ సభ శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో గురువారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బండారు దత్తాత్రేయ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇనాక్ రచనలు సమాజానికి ఎంతో స్ఫూర్తి నిచ్చాయని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు మాట్లాడుతూ సామాజిక, అధునిక సాహితీ విప్లవం ఆచార్య కొలకలూరి ఇనాక్ అని కొనియాడారు. కుల రహిత సమాజాన్ని కోరుకున్న రచయిత అని తెలిపారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో లయన్ విజయ్ కుమార్, రచయిత విహారి, తోట శ్రీలక్ష్మీ పాల్గొన్నారు.
గ్రంథాలయాలను పరిరక్షించుకోవాలి
కాచిగూడ, నవంబర్ 14: గ్రంథాలయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగర కేంద్ర గ్రంథాలయ చైర్మన్ ప్రసన్న రామ్మూర్తి అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం నగర కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రసన్న పాల్గొని ప్రసంగించారు. గ్రంథాలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నాని తెలిపారు. వారం రోజుల పాటు గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి పీ.పద్మజ, పాలక వర్గ సభ్యులు పులి జగన్, మమతా, సంతోష్ గుప్త, పెంటారెడ్డి, వాసుదేవ రావు, లింగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.