హైదరాబాద్

అన్ని బ్యాంకుల్లో మాజీ సైనికుల పెన్షన్ అదాలత్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మాజీ సైనికుల పెన్షన్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే అన్ని బ్యాంకుల అధికారులతో చర్చించి, అన్నింటిలో పెన్షన్ అదాలత్‌లను నిర్వహించనున్నట్లు రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కల్నల్ రమేష్‌కుమార్ వెల్లడించారు. శనివారం రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ, భారతీయ స్టేట్ బ్యాంక్ సంయుక్త్ధ్వార్యంలో పెన్షన్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భారతీయ స్టేట్ బ్యాంక్ సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్(సీపీపీ), సైనిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొని సైనికుల సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కల్నల్ రమేష్‌కుమార్ మాట్లాడుతూ సైనికుల పెన్షన్లను స్వీకరిస్తున్న మిగిలిన ఇతర బ్యాంకులతో కూడా త్వరలోనే ఈ అదాలత్‌ల నిర్వహణపై చర్చించి, నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మాజీ సైనికుల పెన్షన్ సమస్యలే కాకుండా, ఇతర రికార్డు కార్యాలయ సమస్యలను కూడా పరిష్కరిస్తామని అన్నారు. భారతీయ స్టేట్ బ్యాంకు జనరల్ మేనేజర్‌లు శ్రీనివాసరావు, ఎంఏవీఎస్ మూర్తి మాట్లాడుతూ మాజీ సైనికుల సంక్షేమ కోసం, మాజీ సైనిక వితంతువుల కోసం పెన్షన్ అదాలత్‌ను ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉందని, దేశం కోసం సరిహద్దుల్లో పనిచేసి రిటైర్డు అయిన మాజీ సైనికులకు సరైన పెన్షన్ ఇవ్వటం మా బాధ్యత అని, వారికి రావల్సిన బకాయిల గురించి వారికి వివరించి, సకాలంలో చెల్లించనున్నట్లు తెలిపారు. మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించటంలో తమ బ్యాంకు ఎప్పటికీ ముందుంటుందని వారు వ్యాఖ్యానించారు. పెన్షన్ సంబంధించిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించటంతో పలువురు మాజీ సైనికులు, సైనిక వితంతువులు హర్షం వ్యక్తం చేశారు. భారతీయ స్టేట్ బ్యాంక్‌కు చెందిన అరుణ, శ్రీకుమార్, విజయుడు, రమేశ్, హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారులు శ్రీనేష్‌కుమార్, నరోత్తంరెడ్డి పాల్గొన్నారు.