హైదరాబాద్

కష్టాల్లో ఉన్నపుడు మానవత్వం చూపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మనిషిని ఏ మతం, ఏ జాతి అని చూడకుండా మనిషిగానే చూడాలని, కష్టాల్లో ఉన్నపుడు వారి పట్ల మానవత్వం చూపాలని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ బౌద్ధ సంగితి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో జరిగిన బౌద్ధ పురావస్తు శాస్త్రంపై అంతర్జాతీయ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్‌కు మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ సెమినార్‌కు 17 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలవారిని సమానంగా చూస్తు వారి సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారన్నారు. అన్ని మతాల వారి కోసం దేశంలో పాటుపడుతున్న రాష్ట్రం కేవలం తెలంగాణనేనని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ కొండలో దాదాపు 270 ఎకరాల్లో ‘బుద్ధ వనం’ ప్రాజెక్టు కింద థీమ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పార్క్ వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. బౌద్ధమత పురావస్తు శాస్త్రాన్ని పరిరక్షించడానికి, పురాతన శేషాలను సంరక్షించడానికి ఈ ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపారు ఈ సెమినార్‌లో పన్యాల భూపతి రెడ్డి, ఏ దినకర్ బాబు, బీ మనోహర్ , ముంబై బహుజన ఫోరం చైర్మన్ మూల్ నివాసి మాల, బొల్లే శివరాజ్ మహరాజ్, డా. బీ కుమారస్వామి, గ్యారా శేఖర్, గణేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.