హైదరాబాద్

దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం, తార్నాక, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెవెన్యూలో మిగులు రాష్ట్రంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సలహాదారుడు డాక్టర్ జిఆర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఓయులోని ఐసిఎస్‌ఎస్‌ఆర్ హాల్‌లో ఓయు ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలంగాణ ఆర్థిక వ్యవస్థ’అనే అంశంపై జరిగిన ఒకరోజు సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. మిగులు రాష్ట్రం అయినప్పప్పటికి అప్పులు ఎందుకు చేస్తున్నారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతంగా ఉన్నాయని అన్నారు. అందుకే అప్పులు చేయక తప్పని పరిస్థితి ఉందని అన్నారు. ఆచార్య రేవతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అన్నారు. సమైక్య రాష్ట్రంగా ఆవిర్భవించిన నాటి నుంచి అభివృద్ధిలో వెనుకబడిపోయిందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఆచార్య గాలబ్ మాట్లాడుతూ మానవ అభివృద్ధి సూచికలో తెలంగాణ శరవేగంగా ముందుకు సాగుతుందని అన్నారు. ఆచార్య వాసుదేవాచారి, ప్రతాప్‌రెడ్డి, కిషన్‌రావు, నకులారెడ్డి పాల్గొన్నారు.