హైదరాబాద్

స్వచ్ఛవార్డును విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:నగరంలోని ప్రతి వార్డుల్లో పూర్తి స్థాయిలో శానిటేషన్ కార్యక్రమాలను నిర్వహించేందుకు త్వరలో జీహెచ్‌ఎంసీ నిర్వహించనున్న స్వచ్ఛవార్డు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ కాలనీ సంక్షేమ సంఘాలకు పిలుపునిచ్చారు. త్వరలో ప్రారంభించనున్న ఈ స్పెషల్‌డ్రైవ్‌పై మేయర్ సోమవారం ప్రధాన కార్యాలయంలో జోనల్, డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని 150 వార్డుల్లో ఒక్కో వార్డులో రెండు నుంచి మూడు రోజుల పాటు ఈ స్పెషల్‌డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో కాలనీ సంక్షేమ సంఘాలు, మహిళా సంఘాలు, ఆరోగ్య కమిటీలను భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో సుమారు 235 మెట్రిక్ టన్నుల పాత సామానులను సేకరించినట్లు ఆయన తెలిపారు. వార్డుల వారీగా నిర్వహించనున్న ఈ స్పెషల్ డ్రైవ్‌కు సంబంధించి త్వరలోనే వార్డుల వారీగా వివరాలను వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించేందుకు ప్రతి సర్కిల్‌లో ఓ డిపాజిట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్ననట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతిరోజు సేకరిస్తున్న చెత్తలో సుమారు 40 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జోనల్, డిప్యూటీ కమిషనర్‌తో పాటు విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తదితరులు హాజరయ్యారు.