హైదరాబాద్

వైద్యురాలిపై దాడి చేసిన ఇద్దరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, చార్మినార్, ఏప్రిల్ 30: పాతబస్తీ పెట్లబుర్జ్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఓ వైద్యురాలిపై మహిళ దాడి చేసిన సంఘటనలో చార్మినార్ పోలీసులు ఇద్దరు మహిళలను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం కర్నూలు జిల్లా కల్లూరు ప్రాంతానికి చెందిన లలిత అనే మహిళ ప్రసవం రెండు రోజుల క్రితం ఆసుపత్రికి వచ్చి మగబిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం లలిత వెంట వచ్చిన అత్త వైబి లక్ష్మిబాయిదేవి(42), వై.సుజాత(26) కలిసి రెండు రోజుల క్రితం జన్మించిన బిడ్డతో వ్యాక్సినేషన్ చుక్కల కోసం ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి వెళ్లి డాక్టర్ శే్వత ప్రియాంకను సంప్రదించింది. చుక్కల మందు రెండో అంతస్తులో వేస్తారు అక్కడికి వెళ్లండని డాక్టర్ ఆ మహిళలకు చెప్పింది. అంతలో లలితతో పాటు వచ్చిన అత్త లక్ష్మిభాయి, వై.సుజాత(26)లు కలిసి ఇక్కడ మీరు ఏమి చేస్తున్నారని డాక్టర్ శే్వతతో వాగ్వివాదానికి దిగి ఆమెపై దాడి చేశారు. ఈ ఘటనలో డాక్టర్‌కు గొంతు, ముఖంపై స్వల్ప గాయాలు అయ్యాయి దీంతో ఆసుపత్రి వైద్యులకు సమాచారం అందడంతో విధులను బహిష్కరించి ఆందోళనకు దిగడంతో విషయం తెలుసుకున్న చార్మినార్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని లక్ష్మీబాయి, సుజాతలను అదుపులోకి తీసుకుని విచారించారు. చార్మినార్ ఏసిపి కె.అశోక్‌చక్రవర్తి ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. డ్యూటీలో ఉన్న ప్రభుత్వ డాక్టర్‌పై దాడి చేసినందుకు ఇద్దరు మహిళలను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించినట్టు ఏసిపి తెలిపారు.