హైదరాబాద్

సర్కార్ గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్‌ఎంసీ ఇప్పటికే రూ.వెయ్యి కోట్లను బ్యాండ్ల జారీతో సమీకరించుకున్న సంగతి తెలిసిందే! ఇపుడు తాజాగా రూ.2500 కోట్లను రూపే టర్మ్ లోన్(ఆర్‌టీఎల్) తీసుకునే ప్రతిపాదనను ఇటీవలే సర్కారుకు పంపగా, అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. ఈ రుణాన్ని 0.10శాతం వడ్డీకి సమకూర్చుకోవాలని కూడా సర్కారు జీవోలో పేర్కొంది. ఇప్పటికే వంద కోట్లలో ఎస్‌ఆర్‌డీపీ పనులకు, రూ.800 కోట్ల వరకు డబుల్ బెడ్ రూం ఇళ్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పనులు ఆపే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ ఆర్థిక సంక్షోభాన్ని కాస్త మందుగానే పసిగట్టిన అధికారులు మొత్తం రూ. 3500 కోట్ల నిధులు సమకూర్చుకోవాలని, అందులో రూ.వెయ్యి కోట్లు బాండ్ల ద్వారా సేకరించి, ఇందుకు 0.1శాతం అంటే రూ. 15లక్షలను జీఎస్‌టీగా కూడా చెల్లించింది. మరో రూ. 2500 కోట్లను రూపే టర్మ్‌లోన్ ద్వారా సమకూర్చుకోవాలని జీహెచ్‌ఎంసీ భావించింది. రెండో దశగా రెండున్నర వేల కోట్ల రూపాయలను టర్మ్‌లోన్‌గా సమకూర్చుకున్న తర్వాత జీహెచ్‌ఎంసీ ఇకపై బాండ్ల ద్వార గానీ, అప్పుగా గానీ నిధులు సమకూర్చుకునే అర్హత లేకుండా అవుతోంది. ఇదివరకే బాండ్ల ద్వారా నిధులను సమకూర్చిన ఎస్‌బీఐ క్యాప్ ద్వారానే సమకూర్చుకోనున్నారు.
మహానగరంలో వేలాది కోట్లను వెచ్చించి చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టుల వల్లే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జీహెచ్‌ఎంసీకి ప్రస్తుతం రొటీన్ మెయింటనెన్స్ కూడా గగనంగా మారింది. గత నెల జీతభత్యాలు చెల్లించేందుకు సరిపడే నిధులు లేకపోవటంతో రెండు దశలుగా సిబ్బందికి జీతాలు చెల్లించారు. దీంతో పాటు రొటీన్‌గా చేపడుతున్న శానిటేషన్, ఎంటమాలజీ, ప్రాజెక్టుల మెయింటనెన్స్ వంటి బిల్లులు కూడా చెల్లించటం గగనంగా మారింది. ఇక క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే ట్యాక్సు సంబంధిత సిబ్బందికి పన్ను వసూలు చేస్తేనే జీతాలు చెల్లించే ఆస్కారముంటుందని ఉన్నతాధికారులు తేల్చి చెప్పటంతో కనీసం కార్పొరేషన్ కోసం కాకపోయినా, తమ జీతాల కోసమైన పన్ను చెల్లించాలి కదా! అన్ని కొందరు సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు.
భారీగా ఆభరణాలు స్వాధీనం