హైదరాబాద్

పూణెలో మేయర్ బృందం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పూణె స్మార్ట్ సిటీ ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లిన మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ఇతర అధికారులతో కూడిన బృందం రెండోరోజైన బుధవారం పూణెలోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. పూణెలో రోడ్లకు అప్పటికపుడే మరమ్మతులు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ మరమ్మతుల వాహనాన్ని పరిశీలించారు. పూణె స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలను పరిశీలించిన బృందం, పలు అంశాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకుంది. పార్కుల్లో సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎకోఫ్రెండ్లీ సిట్టింగ్ సిస్టమ్, సోలార్ పవర్ యూనిట్లు, ఓపెన్ జిమ్‌లు, వాటి నిర్వహణ అంశాలను మేయర్ నేరుగా అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేసేందుకు పార్కుల్లో ఏర్పాటు చేసిన హార్వెస్టింగ్ పిట్‌లను పరిశీలించారు. ఫుట్‌పాత్‌లపై రాకపోకలు సాగించే వారిలో మహిళలు, వృద్ధులు, చిన్నారులు అలసిపోయినపుడు సేద తీరేందుకు వినూత్న డిజైన్లలో ఏర్పాటు చేసిన చైర్లను పరిశీలించారు. పూణె ప్రధాన రహదారులు, జంక్షన్లు, రహదారులపై ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ విధానాన్ని తెలుసుకున్నారు. పూణె మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న హై కెపాసిటీ మాస్ ట్రాన్సిట్ రూట్, బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ రూట్, సైక్లింగ్‌ప్లాన్, స్మార్ట్ పెడనేస్టేరియన్ స్ట్రీట్ ప్రాజెక్టుల వివరాలను అధికారులు వివరించారు. బృందంలో మేయర్‌తో పాటు చీఫ్ ఇంజనీర్లు శ్రీ్ధర్, జియావుద్దిన్, ఓఎస్‌డీ సురేశ్ కుమార్, ఎస్‌ఈ వెంకట రమణ ఉన్నారు.