హైదరాబాద్

‘పుంజీతం’ కథా సంపుటి ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: ప్రముఖ రచయిత డా.వెల్దండి శ్రీ్ధర్ రచించిన ‘పుంజీతం’ కథా సంపుటి ఆవిష్కరణ సభ దక్కన్ సాహిత్య సభ, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.నందిని సిధారెడ్డి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. రచయిత వెల్దండి శ్రీ్ధర్ అనేక పరిశోధనలు చేసి కథానికలను ఎంతో అద్భుతంగా రచించారని పేర్కొన్నారు. సాహితీవేత్త డా.పత్తిపాక మోహన్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, ఆచార్య సూర్యా ధనంజయ్, సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్, డా.జే.రాజారాం పాల్గొన్నారు.
వేదం వేంకటరాయ శాస్ర్తీ
చిరస్మరణీయుడు
కాచిగూడ, నవంబర్ 21: ప్రముఖ సాహితీవేత్త వేదం వేంకటరాయ శాస్ర్తీ చిరస్మరణీయుడని ప్రముఖ హాస్యావధాని శంకర నారాయణ అన్నారు. వేదం వేంకటరాయ శాస్ర్తీ జయంతి సభ శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో గురువారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శంకర నారాయణ పాల్గొని వేదం వేంకటరాయ శాస్ర్తీ చిత్రపటానికి నివాళి అర్పించారు. వేదం వేంకటరాయ శాస్ర్తీ సాహిత్య రంగనికి చేసిన సేవలను కొనియాడారు. వేదం ఆర్ట్స్ శిష్య బృందం ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గాయనీ తోట శ్రీలక్ష్మీ, నృత్య గురువు వసుమతి పరకాల పాల్గొన్నారు.
నాగరాజుకు అభినందనలు
కాచిగూడ, నవంబర్ 21: ఇటీవల దిల్లీ తెలుగు అకాడమీ 32వ వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివల్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఢిల్లీలో తెలుగు అకాడమీని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం సంతోషదాయకమని పలు సంస్కృతిక సంస్థ ప్రతినిధులు అన్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.ఎన్‌వీఎల్ నాగరాజును కళా సంస్థ ప్రతినిధులు రసమయి అధినేత డా.ఎంకే రాము, ఫాస్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు డా.్ధర్మరావు, సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం, డా.పట్ట్భారాం, గోపాల్ యాదవ్, వీవీ రాఘవరెడ్డి, సతీష్ గురువారం మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. 32 సంవత్సరాలుగా కళా రంగానికి నాగరాజు చేస్తున్న సేవలు మరువలేనివని కీర్తించారు. నాగరాజు సేవలను ఢిల్లీ ప్రభుత్వం గుర్తించి ఢిల్లీ తెలుగు అకాడమీ పేరిట అకాడమీని ఏర్పాటు చేస్తామని హామి ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు.