హైదరాబాద్

మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో ఇటీవల కురిసిన వర్షాల్లో, పలు విపత్కర సమయాల్లో ఎంతో అభినందనీయ సేవలందించిన జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ బృందాలు అదే స్ఫూర్తితో మెరుగైన సేవలందించాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే.తారక రామారావు అన్నారు. నగరవాసుల్లో భద్రతకు సంబంధించి విశ్వాసాన్ని కల్పించటంలో డీఆర్‌ఎఫ్ సఫలీకృతమైందని వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం కొత్తగా సమకూర్చుకున్న మరో ఎనిమిది ఆధునిక డీఆర్‌ఎఫ్ వాహనాలను మంత్రి గురువారం డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
విపత్తుల నివారణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎనిమిది వాహనాల్లో ఒక్కోదానిలో ఆరు ప్రత్యేక పరికరాలు కలిగిన బాక్స్‌లు, జనరేటర్, ఆక్సిజన్ సిలిండర్లను మంత్రి పరిశీలించారు.
ప్రతి వాహనాన్ని పరిశీలించి ఎమర్జెన్సీ సమయంలో వీటిని వినియోగించే తీరును విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి వాహనంలో మెడికల్ కిట్, సేఫ్టీ హెల్మెట్లు, కట్టర్లు, పంప్‌సెట్, డిమాలిషన్ హమర్, స్లాబ్ కట్టర్, ఫైర్ బాల్స్, ఫైర్ సూట్, సేఫ్టీ నెట్‌తో పాటు ఇతర రక్షణ పరికరాలు ఉన్నట్లు సిబ్బంది వివరించారు. వీటితో పాటు రోప్‌లాడర్, ఎలక్ట్రిక్ కట్టర్లు తదితర 13 పరికరాలు ఉన్నట్లు తెలిపారు.
వెలుగులందించే అరుదైన
పరికరం ఆస్కాలైట్
కొత్తగా అందుబాటులోకి వచ్చిన డీఆర్‌ఎఫ్ వాహనాల్లో ప్రత్యేకంగా సమకూర్చిన ఆస్కాలైట్లు రాత్రిపూట చక్కగా పని చేయనున్నట్లు డైరెక్టర్ విశ్వజిత్ వివరించారు. ఆస్కాలైట్లు దాదాపు 20 అడుగుల లోతుకు ఆటోమెటిక్‌గా వెళ్లి, సుమారు 500 మీటర్ల వరకు లైట్‌ను అందించనున్నట్లు వెల్లడించారు.
ఇటీవల గోదావరి నదిలో బోటు మునిగిన సందర్భంలో ఇదే మాదిరి ఆస్కాలైట్ల సహాయంతోనే బోటును వెలికి తీసి పనులను చేపట్టినట్లు డైరెక్టర్ వివరించారు. ఈ ఆధునిక పరికరాలు, వాహనాలను సమకూర్చుకోవటంతో జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం విపత్తుల నివారణ రంగంలో ప్రత్యేకంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ అభినందించారు.