హైదరాబాద్

రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రైతుకు భరోసగా నిలిచే రైతు బీమా పథకానికి పట్టాదార్ పాస్‌పుస్తకాలు కలిగిన రైతులందరూ దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పీ.సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఏఈఓలు ప్రతి రైతు కుటుంబాన్ని ప్రత్యక్ష్యంగా సందర్శించి వివరాలు సేకరించాలని సూచించారు. సోమవారం మంత్రి తన కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖ పనితీరును సమీక్షించారు. ఎవరైనా రైతులు మరణిస్తే వారి వారసులకు ఆర్థిక ఉపశమనాన్ని కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకంలో రైతులందరూ చేరేవిధంగా చూడాలని, ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 946 మంది చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా చెల్లించామని వివరించారు. ఎవరైనా రైతులు మరణిస్తే 10 రోజుల్లోగా పరిహారం అందేవిధంగా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులపై ఉందని అన్నారు. రైతాంగ సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే డివిజన్ స్థాయిలో రైతు అవగాహనా సదస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేశామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిజమైన రైతులు తన ధాన్యాన్ని విక్రయించే విధంగా ప్రోత్సహించాలని కోరారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో కూడా జిల్లా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. భవిష్యత్‌లో రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల కొరత లేకుండా ఇప్పటి నుండే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. భూసార పరీక్షల ఆధారంగా రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ఫలితాలను ప్రదర్శన క్షేత్రాల్లో స్వయంగా చూపించాలని కోరారు. ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో ఎంపిక చేసిన రైతులకు ఇతర రాష్ట్రాల్లో శిక్షణ, అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.గీత, ఏడీఏ చంద్రశేఖర్, ఆత్మ డీపీఓ దివ్యజ్యోతి, ఏఓ హరినాథ్ పాల్గొన్నారు.

అలరించిన ‘ఘంటసాల వైభవం’
కాచిగూడ, డిసెంబర్ 2: పద్మశ్రీ ఘంటసాల జయంతిని సందర్భంగా ‘ఘంటసాల వైభవం’ పేరిట ప్రముఖ గాయకుడు డా.టీ.శరత్ చంద్ర నిర్వహణలో సినీ సంగీత విభావరి సోమవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. సాహితీ గ్రూప్ చైర్మన్ ఆనంద్ నాయుడు, బీ.లక్ష్మీనారాయణ, పూర్ణచంద్ర రావు, తెలంగాణ రాష్ట్ర ఆర్‌అండ్‌బీ నేషనల్ హైవేస్ ఇంజనీర్ గణపతి రెడ్డి, లయన్ విజయ్ కుమార్ పాల్గొని ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు అభివృద్ధి, ఘంటసాల స్వరంతో తెలుగువారికి అందేవిధంగా శరత్ చంద్ర చేస్తున్న విన్నూత ప్రయత్నం అభినందనీయమని అన్నారు. గాయనీ, గాయకులు డా.మిత్ర, బాల కామేశ్వర రావు, వినోద్ బాబు, శశికళా స్వామి, పద్మిని, శివరమ్య అలపించిన సినీ గీతాలు అలరించాయి.