హైదరాబాద్

దివ్యాంగులను విస్మరించడం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అంగవైకల్యం ఎవరూ కోరుకున్నది కాదని, దివ్యాంగులను విస్మరించేవారే నిజమైన వైకల్యురని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో 500 మీటర్ల రన్, ఇతర ప్రత్యేక కార్యక్రమాలని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సరూర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి పూర్తిగా అంధుడైనా, ఆంధ్రాబ్యాంక్‌లో ఉద్యోగం చేస్తూ 40 మంది దివ్యాంగులకు వసతి, విద్యా సదుపాయాలను కల్పించి, వారికి పెళ్లిళ్లు కూడా చేయటం అభినందనీయమని అన్నారు. అతని భార్య కూడా సహకరిస్తూ వారి నెల జీతం మొత్తాన్ని దివ్యాంగులకే ఖర్చు చేస్తున్నట్లు పోచారం వివరించారు. బాలబాలికలకు వేర్వేరుగా వసతి కల్పించినట్లు తెలిపారు. ఇలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించి, వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తుచేశారు. దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లను ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. బ్యాటరీ ట్రైసైకిళ్లకు ప్రభుత్వం రూ.25వేలను రాయితీగా ఇస్తుందని, స్వచ్ఛంద సంస్థలు తమవంతుగా రూ.12వేలను భరించాల్సి ఉంటుందని తెలిపారు. ఓ దివ్యాంగుడు బొప్పాయి పంట వేసి ఆదర్శ రైతుగా నిలుస్తున్నాడని, అతన్ని ఆదర్శంగా తీసుకుని దివ్యాంగులు వాణిజ్య పంటలను వేస్తే ప్రభుత్వం నుంచి సహాయం పొందవచ్చని తెలిపారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తూ పలు జాతీయ అవార్డులను కూడా పొందిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు రూ.3016 పెన్షన్‌గా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ దివ్యాంగుల మానసిక వికాసం కోసం రూ.2కోట్ల వ్యయంతో మలక్‌పేటలో థీమ్ పార్కును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీలోని అన్ని జోన్లలో థీమ్‌పార్కులను ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ.కిషన్ రెడ్డి సతీమణి కావ్యా కిషన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, దివ్యాంగుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్వర్, జీహెచ్‌ఎంసీ అదనపుకమిషనర్ సిక్తా పట్నాయక్, యూసీడీ విభాగం అధికారి తిరుపతయ్య, ఆవర్నెస్ వాక్ కోఆర్డినేటర్ కొల్లి నాగేశ్వర రావు, వికలాంగుల హక్కుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ జీ.పరశురాం, నోబెల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫౌండర్ డీ.సురేశ్ కుమార్ ఉన్నారు.

సెట్విన్ భవనంలోకి సీతాఫల్‌మండి స్కూల్
సికిందరాబాద్, డిసెంబర్ 3: సీతాఫల్‌మండిలోని సెట్విన్ సంస్థ భవనంలోని 12గదులను తాత్కాలిక ఉపయోగార్థం ప్రభుత్వ పాఠశాల, కాలేజీలకు కేటాయించాలని డిప్యూటీ స్పీకర్ టీ.పద్మారావు గౌడ్ ఆదేశించారు. ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్న పాఠశాల, కాలేజీలను మంగళవారం సందర్శించి విద్యార్థులు సమస్యలను తెలుసుకున్నారు. గదులు సరిపోవటం లేదని, సౌకర్యాలు సరిగా లేవని, విద్యార్థులకు తరగతులను నిర్వహించేందుకు అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయని విద్యార్థులు, అధ్యాపకులు వివరించారు. స్థానిక కార్పొరేటర్ సామల హేమ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతి, ఉప విద్యశాఖాధికారి మల్లేషం, ఉపాధ్యాయులు, అధికారులతో సమీక్షించారు. ఒకే ప్రాంగణంలోపాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు గుర్తించి, రూ 21కోట్లతో కొత్త భవనాల నిర్మాణానికి ఏర్పాట్లు చేశామని పద్మారావు తెలిపారు. సికిందరాబాద్‌లో ప్రభుత్వ కాలేజీ లేదనే విషయాన్ని గుర్తించి ముఖ్యమంత్రి అనుమతితో సీతాఫల్‌మండిలో ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కాలేజీని 2016లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.