హైదరాబాద్

టీబీ రహిత సమాజాన్ని నెలకొల్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టీబీ రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు వైద్యులు ప్రజల్లో వ్యాధి పట్ల అవగాహనను పెంపొందించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్ కన్నన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన టీబీ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి టీబీ కేసును ఈ-బర్త్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. నమోదైన ప్రతి కేసుకు సంబంధించిన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులందరికీ తప్పనిసరిగా టీబీ పరీక్షలు చేయాలని సూచించారు. టీబీ సోకితే భయపడాల్సిన అవసరం లేదని, ఆ వ్యాధిని మందులతో తగ్గించవచ్చునని కుటుంబ సభ్యులకు కౌనె్సలింగ్ నిర్వహించాలని అన్నారు. టీబీ వ్యాధి బారిన పడిన వారు మధ్యలో మందులు మానేసిన వారికి తిరిగి చికిత్స ప్రారంభించి వ్యాధి తగ్గేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనుకోని పరిస్థితిలో ఎవరైన టీబీ వ్యాధితో మరణించినట్లు గుర్తిస్తే, వారి మరణానికి గల కారణాలు పూర్తి స్థాయిలో విశే్లషించాలని సూచించారు. చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్తులకు ఎప్పటికపుడు పరీక్షలు చేసి, వ్యాధి తగ్గుదలను సమీక్షించాల్సిన అవసరముందని అన్నారు. టీబీ సోకిన వారితో పాటు చుట్టుపక్కల వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యాధి గుర్తింపు పరీక్షలు నిర్వహించాలని అన్నారు. టీబీ వ్యాధిగ్రస్తులకు విడదల వారీగా ఇవ్వాల్సిన మందులను ఇచ్చి వ్యాధి తగ్గేందుకు వైద్యులు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రవి. టీబీ జాయింట్ డైరెక్టర్ రాజేశం, డీఎంహెచ్‌ఓ డా.వెంకట్, డీటీసీఓ చల్లాదేవి, డబ్ల్యుహెచ్‌ఓ ప్రతినిధులు, వైద్యారోగ్యశాఖ అధికారులు, కో ఆర్టినేటర్ల, ఎన్జీఓ ప్రతినిధులు, ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.