హైదరాబాద్

చీపురు చేతబట్టిన మేయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో పారిశుద్ధ్యం పనులు మరింత మెరుగుపడి, నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్‌గా తీర్చిదిద్దేందుకు మంగళవారం నుంచి ప్రారంభించి ఇంటెన్సివ్ క్లీన్లీనెస్ డ్రైవ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. గడ్డిఅన్నారం వార్డులో ఆయన మంగళవారం ఈ డ్రైవ్‌ను ప్రారంభించి, వీధులను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కోటి పై చిలుకు జనాభా ఉన్న నగరంలో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు కేవలం ఇరవై వేల మంది కార్మికులు మాత్రమే ఉన్నందున, ఈ ఇంటెన్సివ్ క్లీన్లీనెస్ డ్రైవ్‌లో ప్రతి నగరవాసి కూడా భాగస్వామి కావాలని సూచించారు. నగరాన్ని మరింత శుభ్రంగా తీర్చిదిద్దేందుకు రోడ్లపై చెత్తాచెదారం భవన నిర్మాణ వ్యర్థాలను వేసే వారిని గుర్తించి జరిమానాలను విధిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇంటింటికి తిరిగి చెత్త సేకరించేందుకు స్వచ్ఛ ఆటోలకు నెలకు రూ.50 నుంచి వంద స్వచ్ఛందంగా చెల్లించాలని నగరవాసులకు సూచించారు. స్వచ్ఛ హైదరాబాద్ సాధన కోసం వంద అంశాల ప్రాతిపదికన ఈ డ్రైవ్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి వార్డులో నాలుగు రోజుల పాటు డివిజన్‌లోని మెజార్టీ సిబ్బందిని సమీకరించి పారిశుద్ధ్య పనులను పూర్తి స్థాయిలో చేపట్టనున్నట్లు తెలిపారు. మహిళా స్వయం సహాయక బృందాలు, శానిటేషన్, ఎంటమాలజీ విభాగాలు ఈ డ్రైవ్‌లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ప్రతి జోన్‌లో ఈడ్రైవ్ పకడ్బందీగా సాగేందుకు వీలుగా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రజలకు మలేరియా, డెంగ్యూ వ్యాధులపై అవగాహన, వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలను కూడా వివరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ వార్డులోని 112 స్వయం సహాయక బృందాలు, ఎన్జీఓలు, ప్రభుత్వ,ప్రైవేటు కాలేజీలు, వాటి యజమాన్యాలు, విద్యార్థులను ఈ డ్రైవ్‌లో భాగస్వాములను చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కార్పొరేటర్ భవానీ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.