హైదరాబాద్

ఉత్తమ ఫలితాలు సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పదవ తరగతి పరీక్షల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాల ఉత్తమ ఫలితాలను సాధించాలని, అందుకు చదువులో వెనకబడ్డ విద్యార్థులపై ఇప్పటి నుంచే నిరంతర పర్యవేక్షం అవసరమని జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్ కన్నన్ అన్నారు. బుధవారం గత సంవత్సరం టెన్త్ పరీక్షా ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం ఫలితాలపై నిర్మాణాత్మక పరిశీలన చేసి, చదువులో బలహీనంగా ఉన్న వారిపై అధ్యాపకులు స్పష్టమైన అవగాహనకు రావాలని సూచించారు. గత సంవత్సరం ఫలితాలను విశే్లషణ చేసుకుని, ఈ సంవత్సరం అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు కార్యచరణను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల మున్ముందు విద్యాభ్యాసం కోసం టెన్త్ పరీక్ష అనేది ఎంతో ముఖ్యమైందని, ప్రతి విద్యార్థి కూడా పదవ తరగతి తర్వాత చదువు కొనసాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటి నుంచే జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల బలం, బలహీనతలపై స్పష్టమైన అవగాహనకు వచ్చి, వారు పరీక్షల్లో రాణించేందుకు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. అవసరమైన చోట్ల ఉపాధ్యాయుల సర్దుబాట్లు, మార్పిడి ద్వారా విద్యార్థుల సామర్థ్యం పెంచడానికి కృషి చేయాలని సూచించారు. సైన్స్, గణితం వంటి సబ్జెక్టుల్లో ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. లోపాలు సరిచేసుకోవటం, వ్యవస్థను బలోపేతం చేసుకోవటంతో 2020 పదవ తరగతి పరీక్షల్లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు. సమీక్షలో జిల్లా విద్యాశాఖాధికారి వెంకట నర్సమ్మ పాల్గొన్నారు.