హైదరాబాద్

నియోకాన్-2019 నర్సుల శిక్షణ శిబిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్: నెలలోపు నవజాత శిశువులకు చికిత్స అందించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై గాంధీ ఆసుపత్రి, రెయిన్‌బో ఆసుపత్రి సంయుక్తంగా నియోకాన్-2019 పేరిట నర్సులకు రెండు రోజుల శిక్షణ శిబిరం నిర్వహించారు. గాంధీ ఆసుపత్రిలో జరిగిన సదస్సు ముగింపు సందర్భంగా గురువారం పిడియాట్రిక్ వైద్యులు నర్సులకు పలు సూచనలు అందచేశారు. నెలలోపు నవజాత శిశువులకు గ్లూకోజ్ ఎలా పెట్టాలి, పుట్టగానే అనారోగ్యంగా ఉండే శిశువులను గుర్తు పట్టడం ఎలా, ఎన్‌ఆర్‌పీ ఎలా చేయాలి, కృత్రిమ శ్వాస ఎలా అందించాలి, చికిత్సల సమయాల్లో మెలకువలు ఎలా తీసుకోవాలి అనే విషయాలపై నిపుణులైన వైద్యులు శిక్షణ ఇచ్చారు. గాంధీ ఆసుపత్రి పీడియాట్రిక్ సర్జరీ విభాగధిపతి డాక్టర్ జార్జి పర్యవేక్షణలో డాక్టర్ ఎస్.శ్రీకాంత్ భట్ ఆధ్వర్యంలో రెయిన్‌బో హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్ రాజశ్రీ, డాక్టర్ నీలిమ, డాక్టర్ రీనా, గాంధీ అసుపత్రి వైద్యుడు డాక్టర్ ఎస్.శ్రీకాంత్ శిక్షణ అందచేశారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 120 మంది నర్సులు, 15 మంది అధ్యాపకులు శిబిరంలో పాల్గొన్నారు.

శేషాంక్ రెడ్డి, కృష్ణకాంత్ ప్రతిభతో
నోబుల్ క్రికెట్ క్లబ్ ఘన విజయం

హైదరాబాద్, డిసెంబర్ 12: ఏవీ శేషాంక్ రెడ్డి బౌలింగ్‌లో, కృష్ణకాంత్ తివారీ ఆల్‌రౌండ్ ప్రతిభతో నోబుల్ క్రికెట్ క్లబ్ 171 పరుగుల తేడాతో ప్రత్యర్థి సఫీల్‌గూడ సీసీపై ఘనవిజయం సాధించింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న ఏ-3 డివిజన్ వనే్డ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా నోబుల్ సీసీ-సఫీల్ సీసీ గూడ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నోబుల్ సీసీ 33.1 ఓవర్లలో 275 పరుగులు చేసి కుప్ప కూలింది. జట్టు బ్యాటింగ్‌లో రాణించిన కృష్ణకాంత్ తివారీ చక్కటి బ్యాటింగ్ ప్రతిభను కనపరిచి 152 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. కాగా, తివారితో పాటు బ్యాటింగ్‌లో రాణించిన ఆశ్విన్ సురాజ్ 52, రిషికనిష్క 35 పరుగులు చేశారు. అందుకు జవాబుగా బ్యాటింగ్ చేపట్టిన సఫీల్‌గూడ క్రికెట్ క్లబ్ జట్టు 30 ఓవర్లలో 104 పరుగులు చేసి ఆలౌటైంది. నోబుల్ సీసీ బౌలింగ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభ కనపరిచిన కృష్ణ తివారీ నాలుగు వికెట్లు తీసుకొగా ఏవీ.శేషాంక్ రెడ్డి కేవలం 17 పరుగులిచ్చి ఐదు వికెట్లు, అసద్ హుస్సేన్ 24 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో బ్యాంగ్‌లో రాణించిన కృష్ణకాంత్ తివారీ 152 పరుగులు సాధించడమే కాకుండా బౌలింగ్‌లో రాణించి 11 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకుని ఆల్‌రౌండ్ ప్రతిభ కనపరిచారు.