హైదరాబాద్

నేటి నుంచి ప్రజా సంబంధాల జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు నగరంలో అఖిలభారత ప్రజా సంబంధాల సదస్సును నిర్వహిస్తున్నట్టు సొసైటీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఇందుకు సంబంధించిన మాజీ అధ్యక్షుడు చెన్నయ్య, బాబ్జీ, భుజంగ రావు కలిసి ఆవిష్కరించారు. బేగంపేటలోని మనోహర హోటల్‌లో జరిగే సదస్సును మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ హాజరై ప్రారంభిస్తారని చెప్పారు. రమణాచారి అధ్యక్షతన జరుగుతున్న సదస్సుల ముగింపు కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానించినట్టు తెలిపారు.