హైదరాబాద్

ఇంకుడు గుంతలపై అవగాహన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: రాజధాని నగరంలో రోజురోజుకు పెరుగుతున్న నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంకుడు గుంతల ఏర్పాటు ప్రక్రియ ఉత్తమమైనదే అయినా ప్రజలలో పూర్తి స్ధాయిలో అవగాహన కల్పించలేక పోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అంబర్‌పేట నియోజకవర్గంలో ఎక్కడ చూసినా భవనాలు ఉండటంతో పడిని వర్షపునీరు చుక్కకూడా భూమి లోపలకు ఇంకే పరిస్ధితులు కల్పంచడం లేదు. గత 10 సంవత్సరాలలో బహుళ అంతస్తు భవనాలు ఎన్నో నిర్మించినా వాటికి ఇంకుడుగుంతలు లేకపోవడంతో రెండు కుటుంబాలు ఉన్న చోట మూడంతస్తుల భవనాలు నిర్మించడంతో నీటి వినియోగం పెరిగింది. ప్రజలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోరింగులు వేయించుకోవడానికి ఇష్టపడుతున్నారే తప్ప ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే భూగర్భ జలాల పరిరక్షణతో పాటు, పర్యావరణాన్ని రక్షించన వాళ్ళమవుతామని ఒక్కరూ ఆలోచించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కొంత మంది నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా బోర్లు వేసి మినరల్ వాటర్ ప్లాంటు నెల కొల్పుతున్నారు. తద్వారా భూగర్భజలాలు అట్టడుగుకు చేరడమే కాకుండా చుట్టుపక్కల వారి బోర్లు సైతం ఎండిపోతున్నాయి.
‘ముసుగు తొలగిన తర్వాత’ కవితాసంపుటి ఆవిష్కరణ
కాచిగూడ, మే 1: యువ రచయిత శ్రీనివాస్ కాటం రచించిన ‘ముసుగు తొలగిన తర్వాత’ వచన కవితా సంపుటి ఆవిష్కరణ సభ తేజ ఆర్ట్ క్రియేషన్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళాలలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి పాల్గొని కవితా సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలోని అనుభవాలను కవితలుగా రూపొందించారని పేర్కొన్నారు. శ్రీనివాస్ రచించిన కవితలు చదువుతుంటే ఎవరికైనా విద్యార్థి దశ గుర్తుకొస్తుందని తెలిపారు. రచయితలు పుస్తకాలను బాగా చదవాలని సూచించారు. చిన్న వయస్సులోనే శ్రీనివాస్ కవితలు రచించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. నేటి నిజం సంపాదకుడు బైస దేవదాసు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళావేంకట దీక్షితులు, కవి సూర్యప్రకాశ్, స్వాతి శ్రీపాద, వౌనమల్లిక్, సంస్థ అధ్యక్షుడు పోరెడ్డి రంగయ్య, కార్యదర్శి పోరెడ్డి రాజేశ్వరి పాల్గొన్నారు.
సత్ఫాలితాలిస్తున్న పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్, మే 1: హైదరాబాద్ మహానగరంలో శాంతి భద్రతలను పరిరక్షించే క్రమంలో పోలీసులు చేపడుతున్న కార్డన్ సెర్చ్‌లు సత్ఫాలితాలిస్తున్నాయి. జంట కమిషనరేట్‌ల పరిధిలో తరచూ నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్‌ల వల్ల పేరుమోసిన నేరగాళ్ల గుట్టు బట్టబయలు అవుతుండగా దొంగిలించిన వాహనాలు భారీగా పట్టుబడుతున్నాయి. నగరంలో పెరుగుతున్న నేరగాళ్ల ఆగడాలను అరికట్టడానికి పోలీసులు సవాల్‌గా తీసుకుని ఈ కార్డన్ సెర్చ్‌లను ఉద్ధృతంగా నిర్వహిస్తున్నారు. దీంతో ఇటీవల కాలంలో పాతబస్తీలో నిర్వహించిన దక్షిణ మండలం పోలీసుల కార్డన్‌సెర్చ్‌లో వందలాది బాలకార్మికులకు విముక్తి కలిగించారు. అదే విధంగా గుట్టు చప్పుడు కాకుండా వివిధ కార్కానాల్లో ఏళ్ల తరబడి మగ్గుతున్న బాలురకు విముక్తి కలిగించి యజమానులపై కేసులు నమోదు చేసింది. తనిఖీల్లో పలు నేరాలతో సంబంధం కలిగి తప్పించుకు తిరుగుతున్న వారు పట్టుబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా జంట పోలీసు కమిషనరేట్‌లలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న పోలీసులు కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై కూడా దృష్టి సారించారు. ఆకస్మికంగా బస్తీల వారీగా నిర్వహిస్తున్న కార్డన్‌సెర్చ్‌లు మంచి ఫలితాలివ్వడంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో కార్డన్ సెర్చ్‌లను ముమ్మరం చేయడంతో పాటు నాకాబందీ కూడా నిర్వహిస్తూ అనుమానం కలిగిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించడంతో అనేక విషయాలు బట్టబయలవుతున్నాయి. కమిషనర్‌లు ఎం.మహేందర్‌రెడ్డి, సివి ఆనంద్‌లు జంట కమిషనరేట్‌ల పరిధిలో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఈ కార్డన్ సెర్చ్‌ల్లో బంగారం, నగదును పెద్ద మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. సైబరాబబాద్, హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో దొంగిలించిన వాహనాలను సైతం కార్డన్ సెర్చ్‌లో పెద్ద మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. నగరంలోని ఐదు జోన్‌ల పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పాతబస్తీలోని పలుప్రాంతాల్లో తెల్లవారు జామున నిర్వహించిన తనిఖీల్లో కోత్త విషయాలు బట్టబయలయ్యాయి.
మైనారిటీ గురుకుల విద్యాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
వికారాబాద్, మే 1: వికారాబాద్ నియోజకవర్గంలోని మైనారిటీలు ప్రభుత్వం ఈసంవత్సరం ప్రారంభించే మైనారిటీ గురుకుల విద్యాలయాలను సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యుడు బి.సంజీవరావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక అర్‌అండ్‌బి అతిథిగృహం ఆవరణకు మైనారిటి గురుకుల విద్యాలయాల ప్రచార రథం వచ్చిన సందర్భంగా, ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి చిన్నారి చదువుకుని ప్రతి ఇల్లు ప్రగతి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 71 పాఠశాలలను ప్రారంభించనుందని చెప్పారు. పాఠశాలల ఏర్పాటుకు భవనాలను సైతం ఎంపిక చేశారని పేర్కొన్నారు. ప్రతి చిన్నారికి విద్య, వసతి, ఆహారము, ఆరోగ్యలబ్ధి కోసం ప్రభుత్వం 80 వేల రూపాయలను ఖర్చు చేయనుందని తెలిపారు. బాలికలకు ప్రత్యేక శ్రద్ధతో, సురక్షిత వాతావరణంతో కూడిన వసతి సౌకర్యం ఉందని అన్నారు. బాల, బాలికలకు వేర్వేరు ప్రాంగణాలుంటాయని వివరించారు. ఉర్దూ, నైతికవిద్య, దీనియాత్‌తో సహా యావత్ భారతదేశంలోనే ప్రప్రథమ ప్రభుత్వ పాఠశాలలని స్పష్టం చేశారు. దాఖలు చేసేందుకు ఆధార్/రేషన్‌కార్డు, జనన ధృవీకరణపత్రము, పాస్‌పోర్టుసైజ్ ఫోటోలు రెండు, ఆదాయపు ధ్రువీకరణపత్రాలు అవసరమని సూచించారు. ప్రచార రథం వెంట నిర్వాహకులు శ్రీనివాస్, హరీశ్‌లు వచ్చారు. కార్యక్రమంలలో చేవెళ్ళ శాసనసభ్యుడు కె.యాదయ్య, వికారాబాద్ జడ్పిటిసి ముత్తహర్‌షరీఫ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ ఎస్.రాంచంద్రారెడ్డిలు పాల్గొన్నారు.